సుమ రాజీవ్‌ కనకాల ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్‌ విడుదల !

టి.వి. యాంకర్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సుమ, నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న ఆమె భర్త రాజీవ్‌ కనకాల కలిసి వెబ్‌ కోసం ఓ మినీ సినిమాను నిర్మించారు. 60 నిముషాల నిడివి వున్న ఈ సినిమా పేరు ‘అలనాటి రామచంద్రుడు’. ప్రవీణ్‌ యండమూరి, శ్రీముఖి మేకల జంటగా సందీప్‌ మెండి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో కె.రాఘవేంద్రరావు చేతులమీదుగా విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో కొరటాల శివ, ముళ్ళపూడి వర, సుమ, రాజీవ్‌ కనకాలతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్నొన్నారు.

ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ”ఒక కొత్త ప్రయోగాన్ని చేసిన టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను. సుమ, రాజీవ్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతం కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ ”రాజీవ్‌, సుమ మంచి క్రియేటివిటీ వున్న వారు. వాళ్ళు ఏ ప్రొడక్ట్‌ చేసినా సక్సెస్‌ అవుతుంది. ఇంతకుముందు ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పుడు ఈ ‘అలనాటి రామచంద్రుడు’ కూడా పెద్ద సక్సెస్‌ అయి యూనిట్‌లోని అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

హీరో ప్రవీణ్‌ యండమూరి మాట్లాడుతూ ”ఇందులో రామచంద్రుడు క్యారెక్టర్‌ చేశాను. 60 ఏళ్ళ వృద్ధుడిగా కూడా ఇందులో నటించాను. నటనకు ఆస్కారం వున్న ఇలాంటి మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన దర్శకుడు సందీప్‌కి, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సుమ, రాజీవ్‌గార్లకు నా ధన్యవాదాలు” అన్నారు.

దర్శకుడు సందీప్‌ మెండి మాట్లాడుతూ ”ఒక మంచి ప్రయత్నానికి సుమగారు, రాజీవ్‌గారు మంచి సహకారాన్ని అందించి నాతో ఈ సినిమా చేయించారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎఫర్ట్‌పెట్టి చేశారు. అందువల్లే మంచి ఔట్‌పుట్‌ వచ్చింది” అన్నారు.