సన్నీలో ఇన్ని మంచి లక్షణాలున్నాయి !

“ఒక స్త్రీగా, గృహిణిగా సంసార జీవితం హాయిగా ఉంద”ని అంటోంది సన్నీలియాన్. బాలీవుడ్‌లో గ్లామరస్ తార సన్నీలియాన్.. సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. స్టార్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న సన్నీలియాన్‌ 2011లో డానియల్ వెబర్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అప్పటి నుంచి వారిద్దరూ చక్కగా కాపురం చేస్తూ కలిసే ఉంటున్నారు. ఒక పోర్న్ స్టార్ ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంత కాలంగా కలిసి ఉండటం అన్నది చాలా అరుదు. అంతటి అన్యోన్య దాంపత్య జీవితం వారిద్దరిది. ఒక స్త్రీగా, గృహిణిగా సంసార జీవితం హాయిగా ఉందని అంటోంది సన్నీలియాన్.
 
ముంబయ్‌లోని ఓ పాఠశాలను దత్తత తీసుకొని ఆ స్కూల్‌కు కావల్సిన వసతులను సమకూరుస్తోంది. ఇక ఛారిటీ సంస్థలకు, సామాజిక సంస్థలకు సన్నీ ప్రచారకర్తగా ఉంటూ… ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేస్తోంది. అమెరికా క్యాన్సర్ సొసైటీకి, పెటా సంస్థకు సన్నీ తన సేవలను అందిస్తూ.. సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. సన్నీలియాన్ ఓ మంచి చెఫ్ కూడానట. ఇంట్లో ఉన్నప్పుడు తన భర్త వెబర్‌కు తానే స్వయంగా వంటచేసిపెడుతుందట.వంట చేయడమంటే ఒక మహిళగా తనకు చాలా ఇష్టమని చెబుతోంది. ఇక తనను పోర్న్‌స్టార్‌గా ఇప్పటికీ చూస్తూ.. కొందరు తనపై చేసే కామెంట్లను ఎంతో సహనంతో భరిస్తోందట సన్నీ. ఇలా సన్నీలో ఒక మంచి గృహిణి, ఒక మంచి సామాజిక కార్యకర్త, మంచి నటి ఉండడం విశేషమే మరి.
క్యాన్సర్‌తో పోరాడుతున్నవారికి సాయం
సన్నీలియోన్.. పేరు వింటే ఆమె అభిమానుల ఊహలు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో విహరిస్తుంటాయి. ఉత్తరాది.. దక్షిణాది రెండుచోట్లా సన్నీ తనదైన శైలిలో ఐటెమ్ నంబర్స్‌తో అలరించింది.తాజాగా ఈ భామ తను చేసిన పనితో గొప్ప మనసు చాటుకున్నారు. సన్ని లియోన్..క్యాన్సర్‌తో పోరాడేవారి కోసం తన వంతు సాయం చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం తను వేసిన పెయింటింగ్స్‌ను వేలానికి పెట్టింది ఈ భామ. ఈ వేలంలో వచ్చిన డబ్బులను క్యాన్సర్ పేషెంట్స్‌కు ఇవ్వనున్నట్టు తెలిపింది.ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది .క్యాన్సర్‌తో పోరాడుతున్న నిరుపేదలకు తన వంతు ఆర్ధిక సాయం చేయడం కోసం ఈ పెయింటింగ్‌ను వేలానికి పెడుతున్నట్టు తెలిపింది. ఈ పెయింటింగ్స్ వేసేటపుడు వారి గురించే ఆలోచించాను.. అంటూ చెప్పుకొచ్చింది.క్యాన్సర్‌తో పోరాడుతున్న పేదవారికి ఎవరికి తోచినంత వారు సాయం చేయమని కోరింది.