ఏక్తా వెబ్ సిరీస్‌లో సన్నీసూత్రాలు

ఏక్తా కపూర్ ‘కామసూత్ర’పై నిర్మించనున్న వెబ్ సిరీస్‌లో సన్నీ లియోన్ నటించనుంది. ఈ ప్రాజెక్టుకు గురించి సన్నీ, ఏక్తా గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నారు. వాత్య్సాయనుడి కామసూత్రాల ఆధారంగా నిర్మించే ఈ వెబ్ సిరీస్‌లో… శృంగార భంగిమలపై కాకుండా- అందమైన జీవితాన్ని ఎలా గడపాలన్న దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఏక్తా చెప్పిన కథాంశం నచ్చి …ఈ సిరీస్‌లో నటించడానికి సన్నీ లియోన్ అంగీకరించినట్లు తెలిసింది. 13వ శతాబ్దంలో రాజస్థాన్‌లోని గోలీ కులానికి చెందిన మహిళల జీవన పరిస్థితుల నేపథ్యంలో ఈ కాల్పనిక వెబ్ సిరీస్ ఉంటుంది. గతంలో ఏక్తా నిర్మించిన ‘రాగిణి ఎంఎంఎస్ 2’ లో సన్నీ చేసింది.
 
కాల్స్‌, మెసెజ్‌లతో దండెత్తారు
సినిమా వాళ్లు కనిపిస్తే చాలు.. కొందరు జనాలు మీదపడతారు. మరి వారి ఫోన్‌ నంబర్లు దొరికితే …వరుస ఫోన్‌కాల్స్‌, సందేశాలతో ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు. ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది. సన్నీ లియోన్‌ ఫోన్‌ నంబర్‌ లీకైందనే వార్త.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అంతే,ఇక ఆ నెంబర్‌కు “హాయ్‌ సన్నీలియోన్‌”.. అంటూ వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌​.. అసభ్య సందేశాలు వెల్లువెత్తాయి.
 
ఇంతకి జరిగిందేమిటంటే… ‘అర్జున్‌ పాటియాల’ చిత్రంలో ఓ సన్నివేశంలో తన నంబర్‌ను సన్నీ లియోన్‌ చెబుతుంది. అది సినిమాలోని సీన్‌ కోసం చెప్పినా.. అభిమానులు మాత్రం అదే నిజమైన నంబర్‌ అనుకుని.. కాల్స్‌, మెసెజ్‌లతో దండెత్తారు.” ఆ నంబర్‌ నాది.. నా అనుమతి లేకుండా నా నంబర్‌ను ఆ చిత్రంలో వాడుకున్నార”ని ఢిల్లీకి చెందిన పునీత్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు చర్య తీసుకోకుంటే కోర్టుకు వెళ్తానని హెచ్చరించాడు. దానికి సన్నీలియోన్‌ స్పందించింది….”ఇలా జరుగుతుందని ఊహించలేదం”టూ పునీత్‌కు క్షమాపణలు చెప్పింది.