‘నా జీవిత కధా సీరిస్ విజయం గర్వకారణం’

‘కరణ్ జీత్ కౌర్’… సన్నిలియోన్ జీవిత కధతో రూపొందిన వెబ్ సీరిస్ ‘కరణ్ జీత్ కౌర్- ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నిలియోన్’  ఆన్‌లైన్‌లో అదరగొడుతోంది. సంప్రదాయ సిక్కు కుటుంబంలో పుట్టిన కరణ్ జీత్ కౌర్ అనే అమ్మాయి పోర్న్ ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టింది, అక్కడ తనకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, అక్కడి నుంచి బాలీవుడ్‌కు ఎలా ఎంట్రీ ఇచ్చింది ?… అనే సంఘటనలతో ఈ వెబ్ సీరిస్‌ని డైరెక్ట్ చేశాడు ఆదిత్యదత్. సన్నిలియోన్ స్వయంగా తనపాత్రను తానే పోషించడంతో ఈ ‘కరణ్ జీత్ కౌర్’ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సన్నికి ఫాలోవర్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు. అందుకే సన్ని బయోపిక్ సీరిస్‌గా రావడం ఆలస్యం వెబ్ దునియాలో క్లిక్కుల మోత మోగుతోంది.దాంతో ఓ మూవీ రేటింగ్ సంస్థ సర్వే ప్రకారం… ఇండియన్ ఆన్‌లైన్ మీడియాలో ప్రసారం అవుతోన్న సినిమాలు, రియాలిటీ షోస్‌లో ‘కరణ్ జీత్ కౌర్’ రెండో స్థానంలో ఉంది. మరో వెబ్ ఫిల్మ్ ‘సాక్రెడ్ గేమ్స్’ టాప్ పొజిషన్ లో ఉంది.
సన్నిలియోన్ ‘కరణ్ జీత్ కౌర్’ విజయానికి  తెగ సంబరపడిపోతోంది. ఇంత రెస్పాన్స్ రావడంతో పండగ చేసుకుంటోంది. ఆ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంది. ‘తన బయోపిక్ రెండో స్థానంలో ఉండడం తనకు గర్వకారణం’ అంటూ పోస్ట్ చేసింది. మొత్తం ఇరవై ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ వెబ్ సీరిస్ నుంచి ఇప్పటికే పది ఎపిసోడ్స్ అప్ లోడ్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికొస్తే సన్నిలియోన్ ప్రస్తుతం ‘వీరమహాదేవి’ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో సన్ని మహారాణిగా కనిపించబోతోంది. మరి బోల్డ్ క్యారెక్టర్స్ తో అదరగొట్టే సన్ని, మహారాణిగా ఎలా ఉంటుందో చూడాలి…
ఎక్కువ డబ్బుతో ఇబ్బడిముబ్బడి అవకాశాలు
సన్నీ జీవితంలోని చాలా విషయాల గురించి… ఆమె ఫ్లాష్‌బ్యాక్‌ని  ఇప్పుడు జీ5 ఇండియా .. నెట్టింట్లో మొబైల్‌ఫోన్‌ స్క్రీన్‌ మీద ప్రతి ఒక్కరూ చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. సన్నీ పంజాబీ అమ్మాయి. కెనడా, అమెరికాలో పెరిగింది. టీన్స్‌లో ఉన్నప్పుడే తండ్రి ఆర్థిక భారాన్ని తలకెత్తుకునే పరిస్థితి వచ్చింది. మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తను మోడల్‌గా చేసిన ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘లోదుస్తులు’. ఎలాంటి బెరుకు, భయం లేకుండా కెమెరా ముందు నటించింది. ఆ ఆదాయం.. ఆమెలో ఉన్న చిన్న చిన్న ఆశలను నెరవేర్చుకునే వెసులుబాటునిచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు ఓ ఫ్రాక్‌ మీద ఆమె కన్ను పడుతుంది. కొనుక్కునే స్తోమత లేదు. అంతకన్నా ముందు అలాంటి ఫ్రాక్స్‌ వేసుకునే అనుమతీ ఆ ఇంట్లో లేదు. తన సంపాదనతో అలాంటి కలలను నెరవేర్చుకుంటుంది.
మోడలింగ్‌ చేస్తున్నప్పుడే అడల్ట్‌ మూవీస్‌లో అంతకంటే ఎక్కువ డబ్బుతో ఇబ్బడిముబ్బడి అవకాశాలు … వాటిని పక్కకు నెడుతూ ముందుకెళ్తుంది. కానీ ఒకానొక సమయంలో ఒప్పుకోవాల్సి వస్తుంది. నటించడం మొదలుపెడుతుంది. అంత సంపాదన కూతురికెలా వస్తోంది అని ఇంట్లో ఎవరూ సందేహించరు. తండ్రికి అడగాలనుంటుంది కాని అడగడు. అడల్ట్‌ మేగజైన్‌ మీద బొమ్మై కనపడుతుంది వాళ్ల అన్నకి. అప్పుడర్థమవుతుంది చెల్లికి డబ్బెక్కడినుంచి వస్తుందో అని. అయినా ఆపడు. అండగా ఉంటాడు. ఇలాంటి నిజాలన్నీ ‘కరణ్ జీత్ కౌర్’ లో కనిపిస్తాయి.