అవును !.. ఆమెకోసమే అంతా వెతికారు !

సన్నీ లియోన్‌ సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఈ వార్త విన్న సన్నీ ఉబ్బితబ్బిబవుతోంది. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికులు ఎవరి కోసం వెతికారో తెలుసా? ప్రధాని నరేంద్ర మోదీ గురించి కాదు. బాలీవుడ్‌ బాద్‌షాలు షారూఖ్‌, సల్మాన్‌ఖాన్‌లూ కాదు! హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ కోసం! అవును… ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ఇటీవల భారత్‌లో ‘గూగుల్‌ ట్రెండ్స్‌’ను విడుదల చేసింది. ఓరగా కన్ను గీటి రాత్రికి రాత్రి సంచలన తారగా మారిపోయిన కేరళ నటి ప్రియా వారియర్‌ను కూడా వెనక్కు నెట్టి… సన్నీ సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది. పోర్న్‌ స్టార్‌గా పరిచయమైన సన్నీ ఆ తరువాత బాలీవుడ్‌లో తనదైన ముద్రతో సినిమాలు చేస్తూ మెరిపిస్తోంది. ఎక్కవమంది సన్నీ పేరుతో పాటు ఆమె వీడియోల కోసం కూడా గూగుల్‌ చేశారు. కొద్దిమంది మాత్రమే ఆమె బయోపిక్‌ “కరణ్‌జిత్‌ కౌర్‌: ద అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోన్‌” వివరాలను శోధించారు. ఇలా సన్నీ కోసం గూగుల్‌లో పడి తెగ వెతికినవారిలో అత్యధికులు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపూర్‌వారేనట! ఈ వార్త విన్న సన్నీ ఉబ్బితబ్బిబవుతోంది. ‘నిజంగా ఇదో అద్భుతమైన అనుభూతి. ఇన్నేళ్లుగా నన్ను ఆరాధిస్తున్న నా ఫ్యాన్స్‌దే ఈ ఘనత’ అంటూ సంతోషం వెలిబుచ్చింది సన్నీ.
 
సన్నీ కండీషన్లతో నిర్మాతకు షాక్‌
బాలీవుడ్‌లో శృంగార తారగా దూసుకుపోతున్న బ్యూటీ సన్నీలియాన్ సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఈ భామకు మంచి డిమాండ్ ఉంది. అయితే సౌత్‌లో సినిమాలు చేయడానికి సన్నీలియాన్ పలు కండీషన్లు పెడుతోందట. తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాత ఆమెను కలిసి తన సినిమాలో నటించమని అడిగితే సన్నీ అదిరిపోయే కండీషన్లు చెప్పిందట. ఈ భామ పెట్టిన కండీషన్లు నిర్మాతకు పెద్ద షాక్‌నిచ్చాయట. తాను ఏదైనా సినిమాకు సంతకం చేయాలి అంటే… ముందుగా సదరు దర్శక నిర్మాతలు తన నియమ నిబంధనలకు ఒప్పుకోవాల్సిందేనట.
 
తన వద్దకు బౌండ్ స్క్రిప్ట్‌తో వస్తేనే సన్నీలియాన్ సినిమా చేస్తుందట. సెట్స్ కెళ్లాక ఒక్క సీన్‌ను మార్చినా కుదరదు. స్క్రిప్టు పరంగా మార్పులు చేయడానికి వీళ్లేదని సన్నీలియాన్ చెప్పిందట. ఈ కండీషన్లు ఒప్పుకుంటేనే తాను సినిమా చేస్తానని సన్నీలియాన్ టాలీవుడ్ నిర్మాతకు నిర్మొహమాటంగా చెప్పిందని తెలిసింది. నిజానికి చాలా కాలంగా దక్షిణాది నిర్మాతల క్రమశిక్షణారాహిత్యాన్ని ఈ భామ తనదైన శైలిలో ప్రశ్నిస్తోంది. బౌండ్ స్క్రిప్టు లేకుండానే మన నిర్మాతలు సినిమాలు తీస్తారని తీవ్రంగానే సన్నీ విమర్శించింది.