తెలిసో తెలియకో కట్టుబాట్లను తప్పాను!

“నేను చాలా సార్లు కట్టుబాట్లను ధిక్కరించాను. తెలిసో తెలియకో అలా చేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడూ నా కుటుంబానికి, నాకు ఉపయోగకరమైన నిర్ణయాలే తీసుకున్నాను. కచ్చితంగా నమ్మిన సిద్ధాంతాలనే అమలుచేశాను” …అని ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ చెప్పింది . ప్రముఖ మ్యూజిక్ సంస్థ ‘గానా’ నిర్వహించిన ‘కన్ఫెషన్స్ విత్ సన్నీ లియోన్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు…
“తను ఈ మాటలు చెప్పడం ద్వారా చాలామందికి ఇటువంటి విషయాలు బయటకు చెప్పే ధైర్యం వస్తుందనే ఉద్దేశ్యంతోనే, తను ఈ విషయాలు వెల్లడించినట్లు ఆమె స్పష్టంచేశారు. తాను చేసే పనులను చాలామంది తప్పుబడుతుంటారని, అలా చేయడం పెద్ద కష్టం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అసలు విషయం తెలియకుండా ఎదుటి వారు చేసేది తప్పో ఒప్పో మనం ఎలా చెప్తాం?” అని సూటిగా ప్రశ్నించారు.
 
సెట్ లో టీ అందించమన్నా అందిస్తా!
“నిర్మాతనని నాకు ఎలాంటి ఇగో లేదు. సినిమా సెట్ లో టీ అందించమన్నా.. ఎలాంటి సంకోచం లేకుండా అందిస్తా. నాకు అందరూ సమానమే” అని సన్నీ పేర్కొన్నారు. సన్నీ లియోన్ చిత్ర నిర్మాతగా అవతారం ఎత్తనున్నారు. ఒక పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లతో సన్నీ బిజీగా ఉన్నప్పటికీ.. నిర్మాతగా కొత్త బాధ్యతను చేపట్టడానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ చిత్రసీమలో ఇప్పటికే చాలామంది నటీనటులు నటనలో కొనసాగుతూ.. నిర్మాతలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సన్నీ లియోన్ సొంత బ్యానర్ లో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.
 
ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ తన భర్త డేనియల్ వెబర్ చూసుకుంటారని సన్నీ తెలిపారు. సినిమాకు కావలసిన బడ్జెట్, కథ మన ఆధీనంలో ఉన్నప్పుడు ఎవరినీ నిందించాల్సిన అవసరం ఉండదని సన్నీ అన్నారు. తమ చిత్రం ఈ ఏడాది సెట్స్ మీదుకు వెళుతుందని చెబుతూ.. తనకు చాలా ఉత్సాహంగా ఉందన్నారు. ఈ సినిమాలో సందేశాలుండవని..ఇది ఒక ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పారు.
టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది
భారత్‌లో ఈ యేడాది ఎక్కువ మంది జనాలు శృంగార తార సన్నీలియోన్‌ కోసం తెగ సెర్చ్‌ చేశారట. దీంతో మరోసారి అందరినీ వెనక్కి నెట్టి సన్నీ టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. తాజాగా ‘యాహూ’ నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం.. ‘యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ–2019’గా సన్నీలియోన్‌తో పాటు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ నిలిచారు. మరోవైపు బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలను వెనక్కు నెట్టి సన్నీలియోన్‌ టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. 2016, 2017లోనూ సన్నీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది.సల్మాన్‌ఖాన్‌ తర్వాత బాలీవుడ్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌ కోసం నెటిజన్లు ఆన్‌లైన్‌లో గాలించారు.