వాటితో పాటు ఇప్పుడు బ్యూటీ టిప్స్‌తోనూ బిజినెస్

 ప్రేక్షకుల్ని తన అందాలతో కట్టిపడేసిన శృంగారతార సన్నీలియోన్.. సినిమాలనే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకోలేదు. కాసులు కురిపించే ఎలాంటి వ్యాపారాన్నైనా తన శక్తి సామర్ధ్యాలతో చెయ్యాలనే దిశగా అడగులు వేసింది.  ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క రెండు మూడు బిజినెసుల్నీ హ్యాండిల్ చేస్తోంది. ఇవి చాలవన్నట్టు అమ్మడిప్పుడు ఓ స్మార్ట్ బిజినెస్ షురూ చేయనుందట.
 హీరోయిన్స్‌ ఇలా వచ్చిన ఆదాయాన్ని అలా ఖర్చుపెట్టేయడం, ఆ తర్వాత ఆఫర్స్ లేక … ఆదాయ మార్గాలు లేక అలమటించిపోవడం సాధారణంగా జరిగేదే. కానీ శృంగార తార సన్నీ లియోన్ మాత్రం సినిమాలతో పాటు పలు ఆదాయ వనరుల్ని తన సొంతం చేసుకుంది. ఇవి చాలవన్నట్టు సన్నీ అందాల చిట్కాల్నికూడా సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించిందట. కాస్ట్యూమ్స్, పెర్ప్యూమ్స్ లాంటి బిజినెస్సుల్లో మంచి పట్టుసాధించింది. దానికి తగ్గట్టే మంచి లాభాల్నీ అందుకుంది. ఆ ఊపులోనే సన్నీ ఇప్పుడు బ్యూటీ టిప్స్‌తోనూ బిజినెస్ చేయాలనుకుంటోంది. అది కూడా ఒక యాప్ ద్వారా.
అందంగా కనిపించాలని తపించే అమ్మాయిల కోసం కొన్ని టిప్స్‌ను సన్నీలియోన్ ఒక యాప్ ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేస్తోందట. ఎలాంటి డ్రెస్సింగ్‌లో ఎలాంటి మేకప్ అవసరం. లిప్ స్టిక్ నుంచి కాటుక హెయిర్ స్టైల్ వరకు అన్నీ ఎలా ఉండాలి? అనే సలహాలను సన్నీ తన స్టైల్‌లో వివరిస్తుందట. అందంగా అలంకరించుకోవడంలో ఆరితేరిన సన్నీలియోన్.. బ్యూటీ టిప్స్ ఇవ్వడాన్ని పెద్దకష్టమైన విషయంగా అనుకోవడం లేదు జనం. అయితే ఆమె సినిమాలతోనే పబ్బం గడుపుకోకుండా అమ్మాయిల్ని అందంగా మార్చడంలో  చూపిస్తున్న ఆసక్తిని మెచ్చుకుంటున్నారు.