“కరంజిత్ టు సన్నీ” పేరుతో సన్నీ లియోన్ బయోపిక్

బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తూనే ఉంది. ఒక్క రంగానికే పరిమితం కాకుండా వివిధ రంగాలలో రాణించిన ప్రముఖుల జీవిత నేపథ్యంతో సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్ దర్శకులు. సినీ, రాజకీయ, క్రీడా ఇలా పలు రంగాలకి సంబంధించి చాలా బయోపిక్స్ వచ్చాయి. ఇవి మంచి విజయం కూడా సాధించాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ బయోపిక్ కూడా రంగం సిద్ధమవుతుందనే టాక్ వినిపిస్తుంది. హిందీలోనే కాక సౌత్ లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సన్నీ లియోన్ ఇప్పుడు యూత్ కి ఆరాధ్య దేవత అయింది. ఆమె బయోపిక్ అంటే అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది

ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఉన్న సన్నీ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు వేరే ఇండస్ట్రీలలో పలు సినిమాలు చేస్తుంది. పోర్న్ రంగానికి దూరంగా ఉండి దశాబ్ధం కావొస్తుంది. ఇప్పుడు సన్నీ ప్రధాన పాత్రలో వీరమాదేవి అనే చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ అమ్మడి బయోపిక్ ని ప్రచారం లేకుండా ప్లాన్ చేసింది జీ టీవి గ్రూప్. ‘కరెంజిత్ టు సన్నీ’ అనే పేరుతో ఈ మూవీని నిర్మించాలనుకుంటుందట జీ టీవి గ్రూప్. సన్నీ అసలు పేరు కరెంజిత్ కౌర్ . పోర్న్ రంగంలోకి వెళ్ళాకే సన్నీగా తన పేరు మార్చుకుంది. పోర్న్ కి ముందు ఆ తర్వాత సన్నీ జీవిత విశేషాలని బయోపిక్ లో చూపించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుండగా, సన్నీ పాత్రలో ఆమె నటిస్తుందా లేదా వేరే ఎవరైనా నటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది