చివ‌రికి ఓ వ్య‌క్తి త‌న చెయ్యి అందించాడు !

స‌న్నీ లియోన్‌ ఎప్పుడైతే స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే ‘బిగ్‌బాస్’ సీజ‌న్ 5లో పార్టిసిపేట్ చేసిందో.. అప్ప‌టి నుంచీ ఆమె పేరు ఇండియ‌న్ ఆడియెన్స్‌కు తెలిసొచ్చింది. మ‌హేష్ భ‌ట్ త‌న సినిమాలో చాన్స్ ఇవ్వ‌డంతో స‌న్నీ ద‌శ తిరిగిపోయింది. స‌న్నీ లియోన్‌.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె పెద్ద స్టార్‌. అయితే ఆమె గ‌తంలో ఓ పోర్న్ స్టార్‌.  ఆ ఇమేజ్  మొద‌ట్లో ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి ఎన్నో అవ‌మానాల‌కు కూడా గురైన‌ట్లు స‌న్నీ తాజాగా వెల్ల‌డించింది. బాలీవుడ్‌ నటి నేహా ధూపియా నిర్వహిస్తున్న ‘నో ఫిల్టర్‌ నేహా’ అనే టాక్‌ షోలో మాట్లాడుతూ…. తాను వ‌చ్చిన కొత్త‌లో త‌న‌కు జ‌రిగిన అవ‌మానం గురించి చెప్పుకొని బాధ‌ప‌డింది సన్నీ. ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టిన త‌ర్వాత అటెండైన తొలి అవార్డు షో గురించి చెప్పుకొచ్చింది….

అప్పుడు ఆర్గ‌నైజ‌ర్లు త‌న‌ను స్టేజ్‌పైకి ర‌మ్మ‌న్నార‌ని, త‌న‌తోపాటు ఎవ‌రైన యాక్ట‌ర్‌ను తీసుకురావాల‌ని కోరిన‌ట్లు స‌న్నీ చెప్పింది. అయితే త‌న‌తో స్టేజ్‌పైకి రావ‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌లేద‌ని స‌న్నీ వాపోయింది.ఏ  న‌టి, న‌టుడు కూడా రాక‌పోవ‌డంతో తాను చాలాసేపు అలాగే ఆగిపోయాన‌ని…. చివ‌రికి ఓ వ్య‌క్తి మాత్రం త‌న చేయి అందించాడ‌ని చెప్పింది. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. న‌టుడు చుంకీ పాండే. అందుకే ఇప్ప‌టికీ అత‌నంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని స‌న్నీ అంటున్న‌ది. మొద‌ట్లో న‌న్ను చాలా మంది అసహ్యించుకున్నారు. కానీ నేను ప‌ట్టించుకోలేదు. కానీ ఆ అవార్డుల సెర్మ‌నీలో కూర్చోవ‌డానికి మాత్రం చాలా ఇబ్బంది ప‌డ్డాను అని స‌న్నీ చెప్పింది.