నా బయోపిక్‌ను అతను ఇప్పుడే కాదు.. ఎప్పుడూ చూడకూడదు !

“నా బయోపిక్ మొదటి పార్టును అతను చూడకూడదని కోరుకుంటున్నాను”…అని అంటోంది మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియాన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ స్టార్‌గా కొనసాగుతోంది. హిందీ చిత్రాలతో పాటు సౌత్‌లో కూడా ఆమె నటిస్తోంది. ఇక సన్నీలియాన్ బయోపిక్ వెబ్ సిరీస్ మొదటి పార్టు కొంత కాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “కరణ్‌జిత్ కౌర్‌ః ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియాన్” టైటిల్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ వెబ్‌సిరీస్ మొదటి పార్టులో సన్నీలియాన్ ఎక్కడ పుట్టి, పెరిగింది, ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలు, పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లడం… ఇలా పలు ఆసక్తికరమైన విషయాలను చూపించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ రెండవ పార్టు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీని ప్రమోషన్‌లో భాగంగా సన్నీలియాన్ మీడియాతో మాట్లాడుతూ… “నా బయోపిక్ మొదటి పార్టును నా తమ్ముడు చూడలేదు… అతను చూడకూడదని కోరుకుంటున్నాను. తమ్ముడు వోహ్రా నాకు సంబంధించిన కొన్ని విషయాలను తట్టుకోలేడు. అందుకే అతను నా బయోపిక్‌ను ఇప్పుడే కాదు ఎప్పుడు చూడవద్దని కోరుకుంటున్నాను. అతను కూడా నా బయోపిక్‌ను చూడాలని ఆసక్తి చూపించడు”అని చెప్పింది. చిన్న వయసులో కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల పోర్న్‌స్టార్ అయిన సన్నీలియాన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ల సరసన నిలిచింది.