సన్నీలియోన్ ‘గుడ్ గర్ల్ – బ్యాడ్ బాయ్స్’

బాలీవుడ్ అందాల తార సన్నిలియోన్ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెడుతోంది. నటిగా వరుస సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ వ్యాపారరంగంలోనూ దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘లస్ట్’ పేరుతో పర్ఫ్యూమ్ కంపెనీ పెట్టిన సన్నీ, ఇప్పుడు ఫ్యాషన్ రంగం మీద దృష్టి పెట్టింది. యువతను టార్గెట్ చేస్తూ  ‘గుడ్ గర్ల్ – బ్యాడ్ బాయ్స్’ పేరుతో డిజైనర్ దుస్తులను మార్కెట్ చేయనుంది.

ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు అనుష్క శర్మ, దీపిక పదుకొనే, సోనమ్ కపూర్ లు ఫ్యాషన్గ రంగంలో దూసుకుపోతున్నారు. తాజాగా సన్నీ లియోన్ కూడా ఈ రంగంలో తన మార్క్ చూపించేందుకు సిద్దమవుతోంది.

బాలీవుడ్ తార సన్నీ లియోన్.. క్రీడల్లోకి అడుగుపెట్టింది. ప్రీమియర్ ఫుట్‌బాల్ టోర్నీకి సంబంధించిన కేరళ కోబ్రాస్ ఫ్రాంచైజీని తీసుకున్నారు. కొచ్చి కేంద్రంగా ఇది పని చేస్తుందని ఫుట్‌బాల్  నిర్వాహకులు వెల్లడించారు. ఈ జట్టుకు ఆమె సహయాజమానిగా, ప్రచారకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు.