‘సూపర్‌స్టార్‌’ మహేష్‌బాబు ‘మహర్షి’ సెకండ్‌ లుక్‌

‘సూపర్‌స్టార్‌’ మహేష్‌ హీరోగా‘మహర్షి’… సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని చాలా పెద్ద స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్‌ లుక్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్‌ 31 సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేశారు. ఈ చిత్ర షూటింగ్‌ భారీ ఎత్తున జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షెడ్యూల్‌ పూర్తయింది. జనవరి రెండో వారం నుంచి మార్చి వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ కింగ్‌, హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోన్న ఈ ‘మహర్షి’ చిత్రం హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోంది.
దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
 
Superstar Mahesh’s ‘Maharshi’ Second Look
Superstar Mahesh’s latest film is ‘Maharshi’ Directed by Superhit Films Director Vamshi Paidipally, Produced by Sri Venkateswara Creations, Vyjayanthi Movies, PVP Cinema. ‘Maharshi’ marks 25th film of Superstar Mahesh. This film is being made lavishly on a big scale. Second Look of the film has been released as a New Year Gift on December 31st at 6:03 pm. Shoot of the film is going on a brisk pace. Film has recently completed it’s schedule in Ramoji Film City. Entire shoot will be completed with a continuous schedule which will happen from second week of January to March. Film is getting ready to release worldwide as a summer special in April. Pooja Hegde will be seen as heroine with Superstar Mahesh. Comedy King Allari Naresh is doing a pivotal role. ‘Maharshi’ is being made with high technical values involving huge cast.
 
Devi Sri Prasad is composing music while KU Mohanan is handling the camera. Other Technical Team involves Hari Solmon, Sunilbabu, KL Praveen, Raju Sundaram, Sree Mani, Ram-Lakshman,Directed by Vamshi Paidipally