లండన్ లో అవార్డు అందుకున్న సురేష్ రెడ్డి కొవ్వూరి

సురేష్ రెడ్డి కొవ్వూరి యు కె పార్లమెంట్, హౌస్ అఫ్ కామెన్స్, లండన్ లో నిర్వహించిన యు కె బిజినెస్ మీట్ నుండి.. ప్రతిష్టాత్మకమైన ‘మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డును అందుకున్నారు. క్రీయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్  ద్వారా యానిమేషన్ కు చేసిన విశేష కృషికి గుర్తింపుగాను UK పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ ఈ అవార్డును సురేష్ కొవ్వూరి కి అందిందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు సల్మాన్ ఖుర్షిద్, మనోజ్ కుమార్, తేజస్వి యాదవ్, మహువ మెహతా, సీతారాం ఏచూరి ,తెలంగాణ నుండి జయేష్ రంజన్ లతో సహా పలువురు కార్పొరేట్ అధిపతులు పాల్గొన్నారు.
యానిమేషన్ ,గేమింగ్ ఇండస్ట్రీ అనేది అభివృద్ది చెందుతున్న పరిశ్రమ. ఇది భారతదేశానికి ప్రత్యేకించి AR/VR లతో ప్రత్యేక ముద్ర వేయడానికి అధ్బుతమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంది AR/VR , ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి వినూత్న పరిష్కరాలను అందించడానికి, అగ్రగామిగా ఉండడానికి ప్రపంచ భారతీయ యానిమేషన్ పరిశ్రమ వైపు చూస్తున్నది. ప్రతిష్టాత్మకమైన ఆసియా UK బిజినెస్ మీట్ 2022 నుండి అందుకోవడం అనేది క్రెయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ చేస్తున్నటువంటి అద్భుతమైన పనిని ప్రదర్శించేందుకు, అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు అవసరమైన ప్రోత్సహాన్ని  ఇస్తుందని సురేష్ రెడ్డి కొవ్వూరి అన్నారు.