సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్‌ చిత్రం ప్రారంభం !

‘గజిని’, ‘సింగం’ చిత్రాల హీరో సూర్య, ‘ఫిదా’, ‘ఎంసిఎ’ చిత్రాల హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబుల కొత్త చిత్రం షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. సీనియర్‌ హీరో శివకుమార్‌, సూర్య, కార్తీ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ ”నా గత 35 చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సెల్వ రాఘవన్‌ చెప్పిన సబ్జెక్ట్‌ చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. కమర్షియల్‌ వేల్యూస్‌ ఉంటూ అందర్నీ ఆకట్టుకునే చిత్రమిది. ఇందులో హీరోయిన్‌ సాయిపల్లవి క్యారెక్టర్‌కి కూడా మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది” అన్నారు.
దర్శకుడు సెల్వ రాఘవన్‌ మాట్లాడుతూ ”సూర్యలాంటి వెర్సటైల్‌ హీరోతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథకు సూర్య ఒక్కరే యాప్ట్‌ అని సినిమా చూశాక మీకే తెలుస్తుంది” అన్నారు.
నిర్మాతలు ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు మాట్లాడుతూ ”సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న మంచి సినిమా ఇది. రీసెంట్‌గా మా బేనర్‌లో రూపొందిన ‘ఖాకి’ మంచి హిట్‌ అయింది. సూర్య కెరీర్‌లో ఓ పెద్ద హిట్‌ సినిమా అయ్యేలా డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి 18న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి దీపావళికి చిత్రాన్ని రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.
సూర్య, సాయిపల్లవి జంటగా నటించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: జి.కె.ప్రసన్న, ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: సెల్వ రాఘవన్‌.