ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం
ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్”. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. కె.అచ్చిరెడ్డి పుట్టినరోజు వేడుకలతో పాటు “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు.
సాయికుమార్ మాట్లాడుతూ – “వేదవ్యాస్” సినిమాలో వేద నారాయణ అనే మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. మన నాగరికతను మనం మర్చిపోకూడదు అనే మంచి అంశంతో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి గారు రూపొందిస్తున్నారు. ప్రేమకావాలి సినిమాతో అచ్చిరెడ్డి గారు మా ఆదిని పరిచయం చేశారు. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యానో ఈ రోజు విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం చూస్తుంటే అంతే సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా మనకు పరిచయం ఉన్న పిడుగు సుబ్బారావు గారి కొడుకు పిడుగు విశ్వనాథ్ హీరోగా మన ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి. అన్నారు.
హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ – “వేదవ్యాస్” సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. వారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఈ మూవీలో బాగా నటించేందుకు, బాగా కనిపించేందుకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందిరికీ థ్యాంక్స్. నాకు గతంలో ఏడీగా వర్క్ చేసే అవకాశం కల్పించారు నీరజ కోన, త్రికోటి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.
కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ – మా ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతో పట్టుదలగా తయారుచేసుకున్న స్క్రిప్ట్ ఇది. దాదాపు ఐదారేళ్లుగా ఈ మూవీ మీద ఆయన వర్క్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా కోసం ప్రతీ విషయం కొత్తగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కొరియా వెళ్లి ఆడిషన్ చేసి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ ని సెలెక్ట్ చేసుకున్నారు. కొరియా అమ్మాయిని మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడిగితే కొరియా అమ్మాయిని కాదు ఆ క్యారెక్టర్ ను యాక్సెప్ట్ చేస్తారు అని కృష్ణారెడ్డి చెప్పారు. అలాగే మంగోలియా వెళ్లి విలన్ ను సెలెక్ట్ చేశారు. ఒక కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్ ను తీసుకున్నారు. మూవీలో వీళ్లందరినీ చూశాక కృష్ణారెడ్డి గారి జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ అనేది అర్థమైంది. ఈ సినిమాలో సాయికుమార్ గారు వేద నారాయణ అనే ఒక ప్రధానమైన పాత్రలో నటించారు. సాయి గారికి ఈ చిత్రంతో ఎన్నో ప్రశంసలు దక్కుతాయి. ఆయనతో మాకు మా మొదటి సినిమా నుంచి అనుబంధం ఉంది. పొలిటీషియన్, విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మాకు మంచి మిత్రులు. జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలనే ధ్యేయంతో కృష్ణారెడ్డి గారు రెడీ చేసిన స్క్రిప్ట్ ప్రతాపరెడ్డి గారికి బాగా నచ్చి ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. “వేదవ్యాస్” చిత్రంలో హీరోగా విశ్వనాథ్ ఎంత బాగా నటించాడు అనేది మూవీలో చూస్తారు. అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే మా మూవీలో కీలకంగా ఉండే వేద నారాయణ అనే పాత్రలో సాయికుమార్ గారు నటించారు. ఆయన సహజంగానే బాగా నటిస్తారు. “వేదవ్యాస్” సినిమాలో కొరియన్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాం. ఆమె తెలుగు నేర్చుకుని తన డబ్బింగ్ చెప్పుకుంది. అలాగే మంగోలియా విలన్ బాగా నటించాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయల గొప్పదనం చాటేలా రూపొందిస్తున్న ఈ సినిమా గురించి మేము ఇక్కడ చెప్పేది చాలా తక్కువ. మిగతా అంతా మూవీలో చూస్తారు. అన్నారు.
నటీనటులు – పిడుగు విశ్వనాథ్, జున్ హ్యున్ జీ, మురళీ మోహన్, సుమన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, దేవి శ్రీ, నవీనా రెడ్డి, ఐమ్యాక్స్ వెంకట్, బేబి సహస్రశ్రీ, మాస్టర్ మురారి, మాస్టర్ మోక్షజ్ఞ, మాస్టర్ రాయన్


















