అది కష్టమైనా.. దానివల్ల నేను సంతోషంగా ఉంటున్నా!

“నేను మొదట్లో అంత అందంగా లేకపోవడం వల్ల పరిశ్రమలో ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నాను. అంతేకాదు కొంతమంది హీరోల సరసన నేను నటించడం వారి భార్యలకు సిగ్గుచేటుగా భావించి నా స్థానంలో మిగతా హీరోయిన్‌లకు అవకాశం ఇప్పించేవారు”… అంటూ  సినిమా రంగంలో  తన అనుభవాలను చెప్పింది తాప్సి. తను చేసే సినిమాల్లో మహిళ ప్రధాన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నారు తాప్సి.  ‘థప్పడ్‌’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘బద్లా’వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించి తాప్సి పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు.

ఆమె ఒకప్పుడు పరిశ్రమలో అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నానని ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఆ సమయంలో ఇండస్ట్రీలో దురదృష్టివంతురాలిగా తనపై ఓ మార్క్‌ ఉండేదన్నారు. కొందరు నిర్మాతలు వారి సినిమాలకు తను సంతకం చేయడాన్ని సిగ్గుచేటుగా భావించేవారన్నారు. ‘నేను మొదట్లో అంత అందంగా లేకపోవడం వల్ల పరిశ్రమలో ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నాను. అంతేకాదు కొంతమంది హీరోల సరసన నేను నటించడం వారి భార్యలకు సిగ్గుచేటుగా భావించి నా స్థానంలో మిగతా హీరోయిన్‌లకు అవకాశం ఇప్పించేవారు.

సీన్‌లను మార్చిన సందర్భాలున్నాయి… నేను నటించిన ఓ సినిమాకు డబ్బింగ్‌ నేనే చెప్పకున్నాను.అయితే ఇందులో నా గొంతు అంత బాగా లేదని, నేను చెప్పిన డైలాగ్‌ హీరోకు నచ్చకపోవడంతో అది మార్చుకోవాలని ఆ హీరో నాకు సూచించాడు. నేను దానిని తిరస్కరించడంతో.. వారు నాకు తెలియకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టు తో నా వాయిస్ చెప్పించారు. ఇక మరో సినిమాలో హీరో గత చిత్రాలు సరిగా ఆడకపోవడం వల్ల వారి బడ్గేట్‌ కంట్రోల్‌ చేసుకునేందుకు.. నా రెమ్మ్యూనరేషన్‌ తగ్గించుకోవాలని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇక మరో సినిమాలో నా ఇంట్రడక్షన్‌ సీన్‌.. హీరో ఇంట్రడక్షన్‌ కంటే బాగా వచ్చిందని హీరోలు ఆరోపించడంతో నా సీన్‌లను మార్చిన సందర్భాలున్నాయి. అయితే ఇవి నాకు తెలిసినవి, నా ముందు జరిగినవి మాత్రమే. ఇక నాకు తెలియకుండా వెనకాలా ఇంకేన్ని జరిగాయో తెలియదు” అని తాప్సీ చెప్పుకొచ్చారు.

“అప్పటి నుంచి నేను నాకు సంతోషాన్నిచ్చే సినిమాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా ఇప్పటికీ చేస్తున్నాను. కానీ నా నిర్ణయం సరైనది కాదని చాలా మంది నాకు నచ్చజెప్పాలని చూశారు. నా నిర్ణయం వల్ల నేను హీరోయిన్‌గా ఎక్కువకాలం రాణించకపోవచ్చని.. ఇది సరైనది కాదని సలహా ఇచ్చేవారు. ​ఎందుకంటే ఓ హీరోయిన్‌గా లేడీ ఓరియంటేడ్‌ సినిమాలు చేయడం వల్ల హీరోలు తమ సినిమాల్లో అవకాశం ఇచ్చేందుకు వెనకాడతారు. ఇది కష్టమైనదే. అయితే  దీనివల్ల నేను సంతోషంగా ఉంటున్నాను” అని సమాధానం ఇచ్చారు.

తాప్సి‘థప్పడ్‌’కు అరుదైన గౌరవం!… తాప్సి నటించిన హిట్‌ సినిమా ‘థప్పడ్‌’కు అరుదైన గౌరవం దక్కింది. 2020లో జరిగే 14వ ప్రతిష్టాత్మక ‘ఆసియా ఫిల్మ్ అవార్డ్‌’కు గాను అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన థప్ఫడ్‌ రెండు ఆవార్డులకు ఎంపికైంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాలలో థప్పడ్‌ నామినేట్‌ బరిలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనుభవ్‌ సిన్హా సోమవారం ట్విట్టర్‌లో పంచుకుంటూ ఆనందం వ్యక్తి చేశారు. భర్త విక్రమ్ (పావైల్ గులాటి)తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న అమృత (తాప్సీ) వైవాహిక బంధాన్ని ఒక్క చెంప దెబ్బ ఎలా ప్రభావితం చేసిందో దర్శకుడు ఈ సినిమా ద్వారా చూపించాడు. ఈ సినిమాలో తాప్సి అమృతగా ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.