తాప్సీ, శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్స్ విశేషాలు !

ఇప్పుడు దాచేదేం లేదు. అందుకే బయటపెట్టా !
కొంతకాలంగా ఈమె ప్రేమలో ఉన్న తాప్సీ తన బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టింది తాప్సీ. అతడి పేరు మథియస్. ఇప్పుడు తన రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి పబ్లిక్‌గా మాట్లాడటానికి మొహమాటం లేదంటుంది తాప్సీ.
“వ్యక్తిగ‌త, వృత్తిప‌ర‌మైన జీవితాలు రెండూ పూర్తిగా వేర్వేరుగా ఉంచాలి. అలా చేసినప్పుడే జీవితం హాయిగా ఉంటుంది. నా ఫోటోలు కూడా చాలా అరుదుగా షేర్ చేస్తుంటా. నా ప‌ర్సన‌ల్ లైఫ్‌లో భాగ‌మైన‌ ప్రియుడు మథియాస్ విష‌యంలో కూడా ఇన్నాళ్లూ సస్పెన్స్ మెయింటేన్ చేశా. ఇప్పుడు దాచేదేం లేదు. అందుకే బయటపెట్టా. ఒకేసారి ఎక్కువ సినిమాలు ఒప్పుకునే కంటే.. కొన్ని మాత్రమే ఒప్పుకుంటే… అటు ప్రొఫెషనల్, ఇటు పర్సనల్ లైఫ్ హాయిగా ఉంటుంది. రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లి మాత్రం ఇప్పుడు ఉండదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది”అని చెప్పింది తాప్సీ.
అదే వారిద్ద‌రినీ క‌లిపింది !
శృతి హాస‌న్ ఇటీవ‌ల త‌న బ‌ర్త్‌డే లో సంతను హ‌జారికా అనే ఒక కొత్త వ్య‌క్తితో క్లోజ్‌గా ఫొటోలు దిగింది. ఈ ఫొటోల‌ను సంతను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తే… ‘శృతి కొత్త బాయ్ ఫ్రెండ్’ అంటూ నెటిజ‌న్స్ ప్ర‌చారం మొద‌లు పెట్టారు. సంతను హ‌జారికా దీనిపై స్పందించాడు…
“మ్యూజిక్, ఆర్ట్‌లో మా ఇద్ద‌రి అభిప్రాయాలు క‌లిసాయి. శృతి క‌విత‌ల‌ను నేను వీడియోలుగా చేశాను. మా క‌ల‌యిక అన‌ధికారం మాత్ర‌మే. రానున్న రోజుల‌లో మ‌రిన్ని క్రియేటివ్ ప్రాజెక్టుల కోసం ప‌ని చేయ‌బోతున్నాం. వ్య‌క్తిగ‌త జీవితాల గురించి మాట్లాడుకోద‌ల‌చుకోలేదు. ఆర్ట్‌, క‌ల్చ‌ర్‌పై శృతికి మంచి పాష‌న్ ఉంది. అదే మా ఇద్ద‌రిని క‌లిపింది” అని హ‌జారికా పేర్కొన్నాడు . అసోం రాష్ట్రానికి చెందిన సంతను ‘గువాహతి ఆర్ట్ ప్రాజెక్ట్‌’కు కో ఫౌండర్. 2014 డూడుల్ ఆర్ట్ కాంబినేషన్‌లో బెస్ట్ డూడల్ ఆర్టిస్ట్‌గా సంతను గెలుపొందాడు.