పవన్‌, మహేష్‌, ప్రభాస్ ల గురించి ఏమంటోంది ?

‘మిల్కీబ్యూటీ’ తమన్నా… సినీ ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం అయ్యింది తమన్నా . సౌత్‌లో పలువురు స్టార్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ఇప్పటివరకు తాను నటించిన హీరోల గురించి తాను ఎలా ఫీలైందో చెప్పుకొచ్చింది….
“కొందరిని చూస్తే గౌరవించాలనిపిస్తుంది. పవన్‌కళ్యాణ్‌ను చూడగానే మొదట అనిపించేది అదే. ఆయన మాట్లాడుతుంటే శ్రద్ధగా వినాలనిపిస్తుంటుంది. ఆయనతో మాట్లాడిన మధుర క్షణాలను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఎప్పటికీ గుర్తుండిపోయే సంభాషణలున్నాయి. పవన్‌వంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఇక ఛార్మింగ్ హీరో నాగార్జున. ఎప్పుడు చూసిన ఫ్రెష్ బొకేలా కనిపిస్తారు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవాన్నిస్తుంది. నేటి యంగ్ హీరోలకు ధీటుగా ఆయన నటిస్తూ స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. డ్యాన్స్, డైలాగ్ డిక్షన్.. యాక్టింగ్‌లో ఎన్టీఆర్ బ్రిలియంట్. ఒకప్పటి తారక్‌కు ఇప్పటి తారక్‌కు చాలా తేడా కనిపిస్తుంది. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతూ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఇక సూపర్‌స్టార్ అయినప్పటికీ సింపుల్‌గా ఉంటారు మహేష్‌బాబు. ఆయనకు సిగ్గు ఎక్కువ. సినిమా షూటింగ్‌లలో తన పని తాను చేసుకుపోతారు. తన కో-స్టార్స్‌కు ఆయన మంచి సలహాలను కూడా ఇస్తుంటారు. నాకు మంచి స్నేహితుడు చరణ్. సినిమాల విషయం పక్కన పెడితే చెర్రీ ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. అతని భార్య ఉపాసనతో క్లోజ్‌గా ఉంటాను.
నా బెస్ట్‌ఫ్రెండ్ ప్రభాస్ !
‘మెగాస్టార్’ చిరంజీవి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఇక సపోర్టివ్ కో-స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ప్రారంభంలో అతనితో కలిసి చేసిన ‘బద్రినాథ్’లో ‘నాథ్ నాథ్…’ సాంగ్ చేయడం జీవితంలో మరచిపోలేను. డ్యాన్స్‌లో బన్నీ మాస్టర్. అతనితో కలిసి స్టెప్పులు వేయడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. టాలీవుడ్‌లో నా బెస్ట్‌ఫ్రెండ్ ప్రభాస్. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘బాహుబలి’ చిత్రంలో అతనితో కలిసి నటించడం ఓ మధురానుభూతినిచ్చింది. ఇటువంటి మరో చిత్రాన్ని భవిష్యత్తులో నేను చేస్తానో లేదో నాకు తెలియదు. చిత్ర పరిశ్రమలో స్వీటెస్ట్ ఆర్టిస్టు చైతూ. అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ నాన్ ఫిల్మ్ వ్యక్తిగా ఉంటారు. అతనిలో గర్వమనేది అస్సలు కనిపించదు. అలా ఉండటం చాలా కష్టం. ‘ఎనర్జిటిక్ స్టార్’ రవితేజ సినిమా సెట్స్‌లో సరదాగా ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తారు. అతను ఏదైనా మనసులోంచి మాట్లాడతారు”అని చెప్పింది.