ఉయ్యాలవాడ కోసం పోరాడే వీరనారిగా …..

‘బాహుబలి’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌లో వారియర్‌గా ఓ ముఖ్య పాత్రలో కనిపించి కెరీర్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి వారియర్‌గా కనిపించడానికి సిద్ధమైనట్లు తెలిసింది.  టాలీవుడ్‌లో  సీనియర్ హీరోయిన్ల స్టార్‌డమ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక విధంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా టాప్‌లో ఉంటుంది. ఈ భామ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి తన స్టార్‌డమ్‌ను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది.

‘బాహుబలి’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌లో వారియర్‌గా ఓ ముఖ్య పాత్రలో కనిపించి కెరీర్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి వారియర్‌గా కనిపించడానికి సిద్ధమైనట్లు తెలిసింది.  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ బయోపిక్ ‘సైరా’లో తమన్నా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందట. మొదట ఈ ప్రాజెక్ట్‌లో తమన్నా ఎంపికైంది అనగానే ఐటమ్ సాంగ్ కోసం ఎంపిక చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం తమన్నా వారియర్‌గా నటించనుందని తెలిసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసే పోరాటంలో అతని కోసం ప్రాణత్యాగం చేసే వీరనారిగా ప్రేక్షకులను అలరించనుందట. చాలా మందిని ఆడిషన్ చేసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చివరికి తమన్నాను ఎంపిక చేసుకున్నాడని సమాచారం. అమితాబ్‌బచ్చన్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌లో  భారీ బడ్జెట్ తో  రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.