మళ్లీ రొటీన్‌ లైఫ్‌లోకి వస్తా.. మీప్రేమను మీకు తిరిగిస్తా!

తమన్నా కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరిన నెగటివ్‌తో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కారు దిగగానే తన తల్లిదండ్రులను హత్తుకుని, ‘అమ్మయ్యా.. ఫైనల్‌గా ఇంటికి చేరాను’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘‘ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నన్ని రోజులు పిచ్చి పిచ్చిగా అనిపించింది. ఎప్పుడెప్పుడు నార్మల్‌ లైఫ్‌లోకి వస్తానా అనిపించింది. ఈ టైమ్‌లో నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ రొటీన్‌ లైఫ్‌లోకి వస్తాను. నా మీద మీరు  చూపించిన ప్రేమను మళ్లీ మీకు తిరిగి ఇస్తాను. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాను. ఫుల్‌ స్టామినాతో మీ ముందుకొస్తాను’’ అని పేర్కొన్నారు తమన్నా.

నిర్లక్ష్యధోరణితో ఎవరూ ఉండొద్దు!… కరోనా వయసుతో  సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది  తమన్నా. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆమె ముంబయి వెళ్లి తన తల్లిదండ్రులను కలుసుకుంది. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకునే క్రమంలో తన అనుభవాల గురించి మాట్లాడింది తమన్నా…‘హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఓ రోజు అనుకోకుండా జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకున్నా. అందులో కరోనా బయటపడింది. వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నా. నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో వారంలోనే కోలుకున్నా’ అని చెప్పింది తమన్నా.

‘తాను ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తానని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని..అయినా కరోనా బారిన పడ్డానని పేర్కొంది తమన్నా. ‘ఎంతో ఆరోగ్యంగా ఉండే నేను వైరస్‌ సోకిన తర్వాత చాలా బలహీనపడ్డాను. వైరస్‌ ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. వయసుతో సంబంధం లేకుండా యువతరంపై కూడా ప్రభావం చూపిస్తుంది. మాకేమవుతుందిలే! అనే నిర్లక్ష్యధోరణితో ఎవరూ ఉండొద్దు’ అని తమన్నా పేర్కొంది. అయితే కరోనా పట్ల భయాందోళనలు అవసరం లేదని, అనుమానమొచ్చిన వెంటనే పరీక్షలు చేసుకొని ధైర్యంగా చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రతి ఒక్కరూ అవసరమైన  జాగ్రత్తలు తీసుకుంటూనే.. తమరోజు వారి జీవనంలో భాగం కావాలని చెప్పింది.

నాలుగు చేయడానికే ఇబ్బంది!… ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన  బ్యాక్ టు ఫిజికల్ ఫిట్ నెస్ అంటూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న హీరోయిన్ తమన్నా మళ్లీ ఫిట్ నెస్ వైపు దృష్టి పెట్టారు. తాజాగా ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వార్మప్ ఎక్సర్ సైజ్‌లతో స్టామినా పుంజుకునేందుకు ప్రస్తుతం తేలికపాటి వ్యాయామం మాత్రమే చేస్తున్నానని తమన్నా చెప్పారు.కరోనాకు చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరిన వెంటనే తమన్నా బేబీ స్టెప్స్ అంటూ..నెమ్మదిగా యాక్షన్లోకి దిగి పోయారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఫిట్ నెస్ సంతరించుకోవడం చాలా ముఖ్యమని, వ్యాయామం తప్పనిసరి అని ఆమె ఈ వీడియోలో పేర్కొన్నారు. అయితే హడావిడిగా కాకుండా శరీరం చెప్పేది వింటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతంలో 40 పుషప్స్ చేసే ఆమె ఇప్పుడు నాలుగు చేయడానికే ఇబ్బంది పడుతోంది.