వాటన్నింటినీ పుస్తక రూపంలో తీసుకొస్తుందట !

తెలుగులో అగ్రతారగా వెలుగొందారు తమన్నా. ఇప్పుడు తెలుగులో ఎక్కువగా చేయకపోయినా తమిళం, బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు తన అభిరుచులకు తగ్గట్టు ఇప్పుడు ఉంటున్నారు తమన్నా. కథలు రాసుకుంటున్నారు. ఇదేంటీ… హీరోయిన్‌ కథలు రాసుకోవడం ఏమిటి? అనుకుంటున్నారా? మీరు చదివినది నిజమే. తమన్నాకు మంచి రైటింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయి. ఆమెలో ఓ మంచి రచయిత్రి ఉందట. కాకపోతే షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల రాయడం కుదరలేదట. అదే తన అభిరుచి  కూడా. అందుకే ఇప్పుడు తన భావాలను కాగితంపై పెడుతున్నారు. తమన్నా మనసులో కలిగే భావాలను పద్య రూపంలో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారట.ఆమె ఖాళీగా ఉన్నప్పుడు నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటారట. ఆమె రాసినవన్నీ ఓ పుస్తకం రూపంలో తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట తమన్నా. తెలుగులో కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా చేస్తున్న ‘నా నువ్వే’ చిత్రంలో ఆమె కథానాయికగా చేస్తున్నారు.

అప్పటి నుంచి చాలా మారిపోయా !

నేనిప్పుడు చాలా మారిపోయాను అంటోంది మిల్కీబ్యూటీ తమన్నా. యోగా టీచర్‌ అనుష్క సినీరంగప్రవేశం చేసినా, తన పూర్వవృత్తిని మరచిపోలేదు. తన యోగా సరంజామాను షూటింగ్‌ స్పాట్స్‌కు తీసుకెళ్లి నటుడు ఆర్య వంటి సహ నటులకు యోగాను నేర్పించేవారు. దాని ఫలితం గ్రహించిన పలువురు తారలిప్పుడు యోగా బాట పట్టారు. అందులో నటి తమన్నా ఒకరు. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ యుక్తవయసు అమ్మాయిలానే కనిపించే తమన్నా తన అందానికి యోగా ముఖ్య కారణం అంటున్నారు.

హైదరాబాద్‌లోని భరత్‌ ఠాకూర్‌ యోగా ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారట. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ….. తానెప్పుడూ చిన్నపిల్లలా ప్రవర్తించేదానినని, అయితే ఎప్పుడైతే భరత్‌ ఠాకూర్‌ యోగా ఇన్‌స్టిట్యూట్‌లో చేరానో అప్పటి నుంచి చాలా మారిపోయానని చెప్పారు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనర్‌ రుషి అంతగా యోగా శిక్షణను ఇచ్చారని తెలిపారు. యోగాలో శిక్షణ మాత్రమే కాకుండా శారీరకంగా, మానసికంగా ఎలా ఉత్సాహంగా ఉండాలన్న విషయాలను నేర్పించారని చెప్పారు. ‘బాహుబలి’ చిత్రంలో నటిస్తుండగా ఆయనతో స్నేహం ఏర్పడిందని తెలిపారు. అప్పటి నుంచి తాను యోగాలో శిక్షణ పొందుతున్నానని చెప్పారు. నిజం చెబుతున్నా… యోగాలో శిక్షణ పొందిన తరువాత తాను చాలా అదృష్టవంతురాలిననే భావన కలుగుతోందని అన్నారు. ఇప్పుడు షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా యోగా మానుకోనని తమన్నా అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా ‘కన్నె కలైమానే’ చిత్రంలో నటిస్తున్నారు.