డిఫరెంట్ పాత్రలతో బిజీగా సెకండ్ ఇన్నింగ్స్ !

తమన్నా తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా వైవిధ్యంగా దూసుకుపోతోంది. వచ్చిన ఆఫర్లలో తన నటన కు అవకాశం ఉన్నవాటినే ఎంచుకుంటోంది.నితిన్ ‘అందాదున్’ రీమేక్ లో టబు పాత్రలో చెయ్యడానికి అంగీకరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.అది నెగటివ్ షేడ్స్ ఉన్న మధ్య వయసు మహిళ క్యారెక్టర్. తమన్నా ఛాలెంజ్ కు సిద్ధపడే ఈ పాత్రను ఓకే చేసింది .అలాగే దీనికి కోటిన్నర రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది.
 
అప్ కమింగ్ హీరో సత్యదేవ్ తో కన్నడ రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. చాలా డెప్త్ తో  ఎమోషనల్ గా సాగుతుంది. ఊహించని షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ గ్లామర్ పాత్ర కాదు కాబట్టి ఇదీ ఒకరకంగా రిస్కే. హీరో ఎవరు అనేది పట్టించు కోకుండా తమన్నాదీనికి ఓకే చెప్పింది. ఇక మూడోది.. మరో శాండల్ వుడ్ రీమేక్ ‘ఆ కరాళ రాత్రి’ గురించి వినిపిస్తోంది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ కాన్సెప్ట్ మూవీని తెలుగులో ‘ఆహా’ కోసం ప్రవీణ్ సత్తారు తీయబోతున్నట్టు వినికిడి. థియేటర్ కోసం కాకుండా స్ట్రెయిట్ గా ఓటిటి రిలీజ్ కోసమే దీన్ని తీస్తారట.ఇది తమన్నాను వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఓ మారుమూల పల్లెటూరిలో మూడు లొకేషన్లలో సాగే ఈ చిత్ర కథ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఇందులోనూ ఫిమేల్ లీడ్ నెగటివ్ గానే సాగుతుంది. ఒకవేళ తమన్నా చేస్తే మాత్రం తనకు గుర్తుండిపోయేలా నిలిచిపోవడం ఖాయం. ఇది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా చెప్పలేం. మొత్తానికి తమన్నా రెగ్యులర్ పాత్రలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ జానర్స్ ఎంచుకోవడం మంచి విషయమే. మొత్తానికి కొత్త తరం హీరోయిన్ల కన్నా ఎక్కువ బిజీగా తమన్నానే కనిపించడం విశేషమే. తమన్నా ప్రస్తుతం గోపీచంద్‌తో ‘సీటీమార్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
 
వెబ్‌ సిరీస్ కు తమన్నా గ్రీన్‌సిగ్న‌ల్‌ !
కరోనా ప్రభావంతో గత ఐదున్నర నెలల కాలంగా సినిమాల షూటింగ్‌లు లేకపోవడం, థియేటర్లు కూడా ఓపెన్‌ కాకపోవడంతో కథానాయికలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇళ్లకే పరిమితమైన ప్రజలకు వినోదాన్ని అందించే ప్రత్యామ్నాయ మార్గంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ (ఓటీటీ సంస్థలు) బాగా పుంజుకున్నాయి. అంతేకాదు డిజిటిల్‌ మీడియాని శాసించే స్థాయికి వచ్చాయి. దీంతో ఓటీటీల కోసం రూపొందే వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు కథానాయికలు రెడీ అయిపోయారు. ఇప్పటికే బాలీవుడ్‌లో పలువురు హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే సమంత, సాయిపల్లవి వంటి కథానాయికలు సైతం వెబ్‌ సిరీస్‌ల్లో మెరవబోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తమన్నా చేరింది. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు రూపొందించబోయే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు తమన్నా గ్రీన్‌సిగ్న‌ల్‌ ఇచ్చినట్టు సమాచారం. కార్పొరేట్‌ ప్రపంచంలో ఉన్న పోటీ, వేగం వంటి తదితర అంశాల నేపథ్యంలో.. థ్రిల్లర్‌ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. ఈ సిరీస్‌లో తమన్నా మోడ్రన్‌ కార్పొరేట్‌ గర్ల్ గా భిన్న మైన పాత్రను పోషించనుందట.
 
నాలో మంచి కుక్‌ ఉంది !
లాక్‌డౌన్‌ ఖాళీ సమయం తమన్నాను వంటగదికి దగ్గర చేసింది. తనలో ఓ మంచి కుక్‌ దాగి ఉందని తమన్నా చెబుతోంది . ‘‘లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్స్‌తో ఫుల్‌బిజీగా ఉండేదాన్ని. మా ఇల్లు నాకు హోటల్‌లానే అనిపించేది. సినిమాల షూటింగ్స్‌ మధ్యలో కాస్త విరామం దొరికినా నేను మా ఇంట్లో ఉండేది మూడు రోజులే. అసలు మా ఇంట్లో ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో? అవి నాకు ఎంత ఉపయోగపడతాయో? అని కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఈ లాక్‌డౌన్‌లో అవన్నీ తెలుసుకున్నాను. ఇదివరకు నేను ఎప్పుడూ వంట చేయలేదు. లాక్‌డౌన్‌ వల్ల చాలా సమయం దొరకడంతో వంటలు చేశాను. నాలో ఓ మంచి కుక్‌ ఉందని నాకు తెలిసింది ఈ సమయంలోనే. అయితే నేను వంట స్టార్ట్‌ చేసిన మొదట్లో కిచెన్‌ రూమ్‌లో టీ పొడి ఎక్కడుంది? పంచదార ఏ డబ్బాలో ఉంది? అనే విషయాలు తెలియక మొత్తం అల్మరా అంతా వెతికేదాన్ని. ఫస్ట్‌ టైమ్‌ వంట చేసినప్పుడు చాలా గందరగోళంగా అనిపించింది. ఆ తర్వాత మెల్లిగా అన్నీ తెలుసుకున్నాను. వంట చేయడం అంటే వంటకాలను రుచిగా చేయడమే కాదు. వంట రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి’’ అని అంటోంది తమన్నా.