ఎక్కువ అభిమానించే చోటనే పని చెయ్యాలి !

మిల్కీబ్యూటీ తమన్నా… బాలీవుడ్‌లో సెట్ కాలేను అనిపించింది… అని అంటోంది మిల్కీబ్యూటీ తమన్నా. హిమ్మత్‌వాలా, హమ్‌షకల్స్ వంటి సినిమాలతో బాలీవుడ్ అభిమానులను పలకరించిన తమన్నా తన తొలి ప్రాధాన్యం మాత్రం దక్షిణాదికేనంటోంది. బాలీవుడ్‌లో తాను చేసిన సినిమాల ద్వారా కొంత ఇబ్బందిపడ్డానని… అందుకే దక్షిణాదివైపే దృష్టి పెట్టాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. “నేను ఈ స్థాయిలో ఉన్నానంటే సౌత్ ఇండస్ట్రీయే కారణం. మనల్ని ఎవరు ఎక్కువ అభిమానిస్తున్నారో అక్కడే పనిచేయడం మంచిది. తెలుగు, తమిళ సినిమాలతో హ్యాపీగానే ఉన్నాను. నేను ఇప్పటివరకు చేసిన హిందీ సినిమాలేవీ విజయవంతం కాకపోయినప్పటికీ బాలీవుడ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. బాలీవుడ్‌లో సెట్ కాలేను అనిపించింది. అయితే, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా హిందీ సినిమాలు చేస్తాను”అని చెప్పింది.
పవర్‌ఫుల్‌ మహాలక్ష్మి
నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ చిత్రం ‘100% లవ్‌’ గుర్తుందా? ఆ సినిమాలో తమన్నా పాత్ర పేరు ‘మహాలక్ష్మీ’ అని తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో తన గొప్పను తాను చెప్పుకునే ప్రతిసారీ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’ అంటుంది తమన్నా. సరిగ్గా అదే టైటిల్‌తో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ చేశారు తమన్నా. హిందీ మూవీ ‘క్వీన్‌’కి ఇది రీమేక్‌. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. మను కుమరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.
 
సాధారణ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సంఘటనలను ధైర్యంగా ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఇందులో తమన్నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చిత్రం టీజర్‌ను త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తైజాన్‌ ఖొరాకువాలా, సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: మైకేల్‌ టబూరియస్‌.