దేశంలోనే నన్ను తెలియనివారు లేరు!

తమన్నాప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో నటిస్తోంది. ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. “తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు . అన్ని భాషల్లోనూ నటించా.. ఇండియాలోనే నన్ను తెలియనివారు ఎవరూ ఉండే అవకాశం లేదని, అంత పాపులర్‌ అయ్యానని చెప్పింది. అంతగా పేరు, ప్రఖ్యాతలు లభించడం సంతోషంగా ఉందని అంది. తెలుగులో ‘బాహుబలి 1, 2’ చిత్రాల్లో నటించానని.. ఆ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందానని అంది. ఇంతకు ముందు హిందీ చిత్రాల్లో నటించానని..ఇప్పుడు మళ్లీ నటిస్తున్నానని చెప్పింది. తాజాగా నవాజుద్దీన్‌ సిద్ధికి హీరోగా చేస్తున్న చిత్రంలో నటిస్తున్నట్లు.. ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నానని చెప్పింది. అయితే, ప్రేక్షకులు తనను కొత్తగా నటించడానికి వచ్చిన నటిగా చూడాలని..అప్పుడే తానూ ఇంతకు ముందు నటించినదంతా మరచి, కొత్త నటిగా నటించగలన”ని అంది. ప్రస్తుతం ‘బోల్‌ చుడియన్‌’, ‘సీటీమార్‌’ చిత్రాల్లో తమన్నా నటిస్తోంది.
 
‘ఖాళీ’ వార్తల్లో నిజం లేదు!
‘ఖాళీగా ఉండటం వల్లే ‘సరిలేరు నీకెవ్వరు’ పార్టీ సాంగ్‌లో నటించానని అంటున్నారు. ఆ వదంతులు నిజం కాదు…అని అంటోంది తమన్నా. ఏడాదిలో 365 రోజులు పనిచేస్తూనే ఉన్నాను. నేను సినిమాలు లేక ఖాళీగా ఉన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని చెప్పింది . తమన్నా మహేష్‌బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ పాటలో నటించింది . ‘డాంగ్‌ డాంగ్‌..’ అంటూ సాగే పార్టీ సాంగ్‌ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది. తమన్నాకి సినిమాలు లేకపోవడం వల్లే.. ఈ పాటలో నటించిందనే కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీటిపై తమన్నా స్పందిస్తూ… ‘ఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌ బస్టర్‌ అందించిన అనిల్‌ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ పార్టీ సాంగ్‌లో నటించాలన్నప్పుడు ‘నో’ చెప్పలేకపోయాను. ఏడాదిలో మనం ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. చివరి సినిమా విజయమే మనల్ని సంతోషపెడు తుంది. వీలు కుదిరినప్పుడల్లా వివిధ భాషల్లో నటిస్తూనే ఉన్నా’ ..అని తెలిపింది.