విమర్శల వల్ల నా తప్పులను తెలుసుకున్నా !

‘విమర్శల వల్ల నా తప్పులను తెలుసుకుని నన్ను నేను బెటర్‌మెంట్‌ చేసుకున్నాను. సినిమాలపై నాకున్న ప్యాషనే నన్ను నేను తెలుసుకునేలా చేసింది’ అని అంటోంది తమన్నా. ఈ ఏడాది తమిళంలో ‘స్కెచ్‌’ చిత్రంతో తమన్నా అందర్నీ అలరించింది. తెలుగులోనూ ఇదే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అరడజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న తమన్నా నటిగా తన గురించి తాను చెబుతూ…. ‘కథానాయికగా నా ఎంట్రీ బాలీవుడ్‌ చిత్రం ‘చాంద్‌ సా రోషన్‌ చెహ్రా’తో ప్రారంభమైంది. అప్పట్నుంచే బాలీవుడ్‌లో ఓ మంచి స్థానం కోసం ప్రయత్నిస్తున్నా. ఈ క్రమంలో నన్ను నేను తెలుసుకున్నా. అదంతా నాకు సినిమాల పట్ల ఉన్న ప్యాషన్‌ వల్లే సాధ్యమైందని భావిస్తున్నా. నువ్వేంటనేది తెలియడానికి ప్యాషన్‌ గొప్ప మాద్యమం. కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళడం, నచ్చిన దానికోసం హార్డ్‌వర్క్‌ చేయడం వల్లే మనమేంటో తెలుస్తుంది. ఈ విషయంలో విమర్శలు కీలక పాత్ర పోషిస్తాయి. విమర్శల వల్ల నా తప్పులను తెలుసుకుని నన్ను నేను బెటర్‌మెంట్‌ చేసుకున్నాను. కొన్ని సార్లు విమర్శ హార్ష్‌గా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అదే హెల్ప్‌ అయ్యింది. ఎన్నో విభిన్న పాత్రలు చేసేలా దోహదపడింది’ అని తెలిపింది. తమన్నా ప్రస్తుతం ‘నా నువ్వే’, ‘క్వీన్‌’, ‘ఏ.బి.సి’, ‘ఖామోషి’, ‘కన్నె కలై మానె’తోపాటు కునాల్‌ కోహ్లి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

 పూలూ.. రాళ్లూ… రెండూ భరించాల్సిందే !

.. అంటున్నారు తమన్నా. ఈ మధ్య హీరోయిన్స్‌ పబ్లిక్‌ అప్పియరెన్సెస్‌ ఇస్తే చాలు అనుకోని ఇబ్బందులకు గురవుతున్నారు. ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించటం లేదా కామెంట్స్‌ చేయటం జరుగుతోంది. కొంతమంది సంస్కారం మరచిపోయి పాదరక్షలు కూడా విసిరేస్తున్నారు. తమన్నాకు ఈ మధ్య అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ షోరూమ్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన తమన్నాపై ఓ ఆకతాయి చెప్పు విసిరిన విషయం తెలిసే ఉంటుంది. అది ఆమెకు కొంచెం దూరంలో పడింది.

ఆ సందర్భలో ఏమీ స్పందించకుండా వెళ్లిపోయారు తమన్నా. ఇప్పుడా సంఘటన  గురించి స్పందించారామె…. ‘‘అలా రియాక్ట్‌ అయినవాళ్లను ఏమీ  చేయలేం. మేం యాక్టర్స్, మా మీద ప్రేమతో వేసే పువ్వులను, ద్వేషంతో విసిరే రాళ్లను ఒకేలా స్వీకరించాలి’’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. తను ఈ మధ్య సినిమాలు చేయటం తగ్గించేశారు. ఆవిడను కలుద్దాం అంటే బౌన్సర్స్‌ ఆమె దగ్గరకు వెళ్లనీకుండా చేశారు. ఆ కోపంతో ఆమె వైపు షూ విసిరేశాను’’ అని పేర్కొన్నాడు ఆకతాయి.