నటిగా గుర్తింపు తెచ్చే సినిమాలే ఇకపై చేస్తా !

తమన్నాభాటియా… నా అదృష్టం కొద్దీ తెలుగు ప్రేక్షకులు నాకో స్టార్‌ హోదా ఇచ్చారు. కానీ నేనెప్పుడూ ఓ స్టార్‌గా ఫీలవలేదు. నన్ను ‘స్టార్‌ హీరోయిన్‌’ అనడం కన్నా, తమన్నా ‘మంచి నటి’ అంటేనే నాకు చాలా ఇష్టం. అలాంటి గుర్తింపునే కోరుకుంటాను. కెరీర్‌ ప్రారంభంలో గ్లామర్‌ పాత్రలు చేయాలి. గుర్తింపుకు అవి అవసరం. కానీ ఇన్ని సంవత్సరాల తరువాత ఇంకా గ్లామర్‌ పాత్రల కోసం వెంపర్లాడడం అనవసరం. గ్లామర్‌ తారగా వచ్చిన గుర్తింపు చాలనిపించింది. ఇప్పటి వరకూ చేసిన గ్లామర్‌పాత్రలు చాలు. నటిగా నాకో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే సినిమాలు చేయాలన్నదే నా కోరిక. అలాంటి సినిమాలే ఎక్కువగా చేస్తున్నాను. అలా అని గ్లామర్‌ పాత్రలకి పూర్తిగా దూరం కాను. మధ్య మధ్యలో వాటినీ చేస్తాను. పూర్తిగా సీరియస్‌ పాత్రలకే పరిమితమైతే కూడా కష్టమే! తమన్నా ఓ మంచి నటి అనిపించుకోవాలని అనిపించింది. ఆ దిశగానే సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాను. నా రాబోయే సినిమాల్లో ఆ మార్పు స్పష్టంగా కనపడుతుంది. తమన్నానే ఇలాంటి పాత్ర చేసింది? అని అందరూ ఆశ్చర్యపోతారు కూడా!
 
మంచి పాట అనిపిస్తే వెనుకాడను !
తమన్నా ఐటెంసాంగ్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తోంది అంటున్నారు కొందరు అనుకుంటున్నారు. నిజం ఏమిటంటే…నాకు గుర్తింపు తెచ్చి పెట్టింది నా డాన్సే! మామూలుగా హీరోయిన్‌గా చేసే సమయంలో నా డాన్స్‌ టాలెంట్‌ చూపించే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే ఐటెంసాంగ్‌, లేదా స్పెషల్‌ సాంగ్ప్‌లో అయితే నా డాన్స్‌ టాలెంట్‌ పూర్తిగా చూపించవచ్చు. అందుకే అవి చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను. అలా అని పూర్తిగా వాటికే పరిమితం కాను. మంచి పాట అనిపిస్తే చేయడానికి ఎప్పుడూ వెనుకాడను.
 
‘ఎఫ్‌2’తో చాలా పెద్ద హిట్ వచ్చింది. ‘ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి’ విడుద‌ల‌కు సిద్ధమ‌వుతుంది. త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో సినిమా చేస్తున్నాను. అలాగే ‘సైరా’ న‌ర‌సింహారెడ్డి సినిమాలో చిరంజీవిగారితో క‌లిసి న‌టిస్తున్నాను.