కష్టపడకుండా ఏదీ వచ్చేయదు !

నటిగా మీరు ఇంత పేరు, అభిమానాన్ని సంపాదించుకున్నారు.మీ సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటి? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే…. ‘‘పేరు, డబ్బు, సౌకర్యవంతమైన జీవితం కోసం మాత్రమే యాక్టింగ్‌ ప్రొఫెషన్‌ను ఎంచుకుంటున్నారని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ అది నిజం కాదు. నటన పట్ల తపన లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలవలేం. నా సక్సెస్‌కి కారణం అదే. యాక్టర్‌గా ప్రూవ్‌ చేసుకున్న తర్వాత మాత్రమే పేరు, డబ్బు వస్తాయి. అప్పటివరకు అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. కష్టపడకుండా ఏదీ వచ్చేయదు’’ అని చెప్పుకొచ్చారు.
ఒకవేళ మీరు యాక్టర్‌ కాకపోయి ఉంటే ఏ రంగాన్ని ఎంచుకునేవారు అని అడగ్గా… ‘‘యాక్టింగ్‌ లేకుండా నా లైఫ్‌ని ఇప్పుడు ఊహించుకోలేను. అయితే మెడికల్‌ సెక్టార్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్‌ ఉన్నారు. సో… మెడిసన్‌ చదివేదాన్నేమో’’ అని చెప్పారు.
మంచి తత్వంలో కూడిన వ్యాఖ్యలు
తమన్నా ఈ మధ్య వేదాంతం మాట్లాడుతోంది. తమన్నానటిగా తనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం ‘బాహుబలి’ రూపంలో అవకాశం వచ్చింది. అందులో వీరనారి అవంతికగా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. ‘డాన్సింగ్‌స్టార్‌’ ప్రభుదేవాతో నటించిన తమన్నా చేసిన’ దేవి 2′ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. హిందిలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదీ నటనకు అవకాశం ఉన్న పాత్రనేనని ప్రచారంలో ఉంది.
 
ఇలాంటి పరిస్ధితుల్లో ఈ మిల్కీబూటీ వేదాంతం గురించి మాట్లాడుతోంది. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో దశాబ్ధానికి పైగా నటిస్తున్న తమన్నా షూటింగ్‌ లేని సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతుందట. దీని గురించి ఇటీవల ఒక భేటీలో తెలుపుతూ… పుస్తకాలు చదవడం అంటే తనకు చాలా ఆసక్తి అని చెప్పారు.అందులోనే వేదాంత పుస్తకాలను అధికంగా చదువుతానని తెలిపారు.
 
అయితే, అంతటితో ఆగకుండా తమన్నా మంచి తత్వంలో కూడిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో రోజుకొక్కటి చొప్పున పోస్ట్‌ చేస్తున్నారు. అయితే వాటిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదట. కారణం.. తమన్న వేదాంతపు వ్యాఖ్యలు హిందీలో ఉంటున్నాయి.కాబట్టి హిందీ భాష తెలిసిన వారే తమన్న తత్వాలను అర్థం చేసుకోగలుగుతారు. దీంతో ఎవరైనా తమన్నా వేదాంతపు వ్యాఖ్యలను తెలుగు, తమిళం భాషల్లోకి అనువదిస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. కొందరైతే తమన్నకిప్పుడే ఈ వేదాంతం గొడవ ఏమిటీ? అని ప్రశ్నిస్తున్నారు.