ప్రాధాన్యత పెరిగే కొద్దీ ఆ తేడా తగ్గుతోంది!

“హీరో, హీరోయిన్‌ల మధ్య రెమ్యునరేషన్ తేడా… మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాలంతో పాటు ఇదంతా మారుతూ వస్తోంది”… అని అంటోంది తమన్నా. “సహజంగానే సినిమా ఇండస్ట్రీ పురుషాధిక్య ప్రపంచం. హీరోలకు ఇచ్చే పారితోషికంతో పోలిస్తే… హీరోయిన్‌లకు ఇచ్చే మొత్తం చాలా తక్కువ. కానీ, కాలంతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా మారుతోందని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. “హీరో, హీరోయిన్‌ల మధ్య రెమ్యునరేషన్ తేడా… మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాలంతో పాటు అది మారుతూ వస్తోంది. రెమ్యునరేషన్ గ్యాప్ ఇదివరకుతో పోలిస్తే తగ్గింది. ఇకమీదట ఇంకా తగ్గుతుంది. సినిమాల్లో లేడీ క్యారెక్టర్లకు ప్రాధాన్యత పెరిగే కొద్ది.. ఈ తేడా తగ్గుతోంది ”అని చెప్పింది తమన్నా. ఇటీవల చిరంజీవి ‘సైరా’లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది తమన్నా.
 
దానికి మాత్రం నేనెప్పుడూ సిద్ధమే
కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే గ్లామరస్ పాత్రల్లో నటించినప్పటికీ.. తమన్నా ఎప్పుడూ కొన్ని హద్దులు దాటలేదు. మితిమీరి ముద్దు సీన్లు ఇప్పటివరకు చేయలేదు. అయితే, విశాల్ సరసన తాజాగా నటించిన `యాక్షన్` సినిమాలో మాత్రం తమన్నా.. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అందాల విందు చేసింది. తొలిసారి బికినీ ధరించింది. దీని గురించి తమన్నా మాట్లాడుతూ… “బికినీ వేసుకోవాలంటే సరైన శరీరాకృతి ఉండాలి. నాకు అలాంటి శరీరం లేదనుకున్నా. కానీ, ఈ సినిమా కోసం కఠినమైన డైట్… ఎక్సర్‌సైజ్‌లు చేసి బరువు తగ్గాను. కెరీర్ ప్రారంభం నుంచి నేను కొన్ని హద్దులు పెట్టుకుని… ముద్దు సీన్లలో నటించకూడదని అనుకున్నా. ఇప్పటికీ అలాగే ఉన్నా. అయితే, గ్లామరస్‌గా కనిపించడానికి మాత్రం నేనెప్పుడూ సిద్ధమేన”ని తమన్నా చెప్పింది.
 
వెబ్‌ సిరీస్‌లో లీడ్‌ రోల్‌
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రకరకాల పాత్రలు చేస్తూ నటిగా పదిహేను ఏళ్లుగా కొనసాగుతోంది తమన్నా.. కొన్నిసార్లు స్పెషల్‌ సాంగ్స్‌ కూడా చేసింది. ఇప్పుడు నటిగా ఆమె ఓ కొత్త ప్లాట్ఫార్మ్ లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ.. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి తమన్నా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ‘వికడన్‌ టెలీవిస్తాస్‌’ నిర్మిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లోఆమె లీడ్‌ రోల్‌ చేస్తోంది . ఈ వెబ్‌ సిరీస్‌ ‘హాట్‌స్టార్‌’లో ప్రసారం కానుంది. ఈ సిరీస్‌ ఏ జానర్‌లో ఉండబోతోంది.. ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ స్టేజ్‌లో ఉంది. ఇది కాకుండా హిందీలో ‘బోల్‌ చుడియా’ చిత్రీకరణలో పాల్గొంటున్న తమన్నా… తమిళంలో ఓ సినిమా కూడా కమిట్‌ అయ్యింది .