నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటా!

అందరిలాగే నేనూ తప్పులు చేస్తాను. నా తప్పుల గురించి వచ్చిన నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను“… అని అంటోంది తమన్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లే పొగడ్తలు, విమర్శలు ఉంటాయి. నటిగా మీ కెరీర్‌లో ఎదురయ్యే విమర్శలను మీరు ఎలా తీసుకుంటారు? అని తమన్నాను అడిగితే … ‘‘నేనేం దేవుణ్ణి కాదు. మామూలు మనిషిని. అందరిలాగే నేనూ తప్పులు చేస్తాను. నా తప్పుల గురించి వచ్చిన నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను. నన్ను నేను విశ్లేషించుకుని నాలోని లోపాలను సరిదిద్దుకుంటాను.అంతేకానీ తప్పుడు విమర్శలను పట్టించుకుని అనవసరంగా బాధపడను’’ అని పేర్కొన్నారు.
 
దర్శకత్వం ఆలోచన ఏమైనా ఉందా? అడిగితే … ‘‘దర్శకత్వం అంటే చిన్న విషయం కాదు. సినిమా గురించిన ప్రతి విషయంపై అవగాహన ఉండాలి. పాత అంశాలను కొత్త దృష్టి కోణంలో చూడగలగాలి. అన్నింటికన్నా ముందు చాలా ఓర్పు ఉండాలి. అంత ఓర్పు నాలో లేదు. ప్రసుతం దర్శకత్వం ఆలోచన లేదు. అయితే, శ్రీదేవి బయోపిక్‌ను ఎవరైనా తీస్తే అందులో నటించాలని ఉంది’’ అని చెప్పింది తమన్నా.
 
అతనితో లిప్‌లాక్‌ కు అభ్యంతరం లేదు
ఆ స్టార్ కోసం కోసం తన నిబంధనలు ఎత్తేస్తానంటోంది తమన్నా. తాజాగా విశాల్‌తో జతకట్టి ‘యాక్షన్‌’ లో తన అందాలతో తెరపై విందు చేసింది. గ్లామరస్‌ పాత్రలతోనే స్టార్‌ హీరోయిన్‌ అయిన తమన్నా ‘బాహుబలి’, ‘సైరా ‘ వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. అభినయంలోనూ సత్తా చాటుతానంటున్న తమన్నా.. ఇకపై గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటిస్తానని చెబుతోంది . తమన్నా లిప్‌లాక్‌ సన్నివేశాల్లో ఇప్పుటి వరకూ నటించలేదు, ఇకపై నటించను కూడా అని చెప్పింది . దర్శక నిర్మాతలకు విధించే షరతు ఇదేనని పేర్కొంది.
 
అలాంటిది, ఇప్పుడు తమన్నా ‘ఒకే ఒక్క నటుడికి మినహాయింపు’ అంటోంది. ఆ నటుడెవరంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌రోషన్‌ అట. అతనితో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంటోంది. కారణం ఏమిటయ్యా అంటే… హృతిక్‌రోషన్‌కు తాను వీరాభిమానినని చెబుతోంది. అసలు విషయం ఏమిటంటే…కొన్ని హిందీ చిత్రాల్లో నటించినా, బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆమెను పట్టించుకోలేదు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించాలన్న తమన్నా కోరిక తీరకనే మిగిలిపోయింది.అందుకే హృతిక్‌ వంటి స్టార్‌ హీరో ని ఆకట్టుకోవడానికి .. అతనితో లిప్‌లాక్‌లో నటించడానికి తనకు అభ్యంతరం లేదని కొత్త పాట పాడుతోంది .