మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ బయోపిక్‌

బయోపిక్‌ల ట్రెండ్‌ దక్షిణాదిలోనూ ఊపందుకుంది. ఇప్పటికే మహానటి సావిత్రిపై సినిమా రూపొందుతుండగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో తమిళ లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ (ఎం.జి.రామచంద్రన్‌) జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్‌ రాబోతుంది. అయితే చాలా రోజుల నుంచే ఈ చిత్రం ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకుడు బాలకృష్ణన్‌ తెరకెక్కించ బోతున్నారు. రమణ కమ్యూనికేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ఎంజీఆర్‌ పాత్రలో నటించే నటుడి కోసం అన్వేషణ జరుగుతుందట. ఆ పాత్రకు నటుడు సత్యరాజ్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. చిత్ర బృందం కూడా ఆయనైతేనే బాగా సూట్‌ అవుతారని అంటున్నారట. నవంబర్‌ 8న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.