సవీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశదిమ్మరి’. నగేష్ నారదాశి దర్శకత్వంలో తనీష్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న
ఈ చిత్రంలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ వెంకట్ ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు నగేష్ నారదాశి మాట్లాడుతూ….
మానవత్వ విలువలను చాటి చెప్పే చిత్రమిది. ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది తప్ప.. అత్యాశను కాదు అనే సిద్దాంతాన్ని నమ్మే ఓ యువకుడి కథే ఈ దేశ దిమ్మరి. డబ్బుతో అవసరం లేకుండా జీవనం సాగించే ఓ వైవిధ్యభరితమైన కధాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు
న్నాము. పంజాబ్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలొ షూటింగ్ చేశాము. పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలొ సినిమాను విడుదల చెస్తామన్నారు.
Tanish Is A “Desha Dimmari”
Bollywood producer Savi Goel is producing a film titled ‘Desha Dimmmari’ on Saveena Creations Banner. Tanish is the lead actor in the film directed by Nagesh Naradasi. Entire shooting of the movie has been wrapped up. Presently, post-production works are happening. Suman, Mukul Dev and Fish Venkat are playing prominent roles in the film that has music by Subhash Anand.
While speaking on the occasion, director Nagesh Naradasi said, “Desha Dimmari will describe the importance of human values and ethics. The film is all about a youngster who believes the philosophy of nature will only fulfill our needs, but not greed. The film also defines that we can live without money which is actually not the prime necessity. Shooting took place in Punjab, Haryana and Himachal Pradesh. Post production works are going on. We will release the film in February.”