తనిష్క్ రెడ్డి హీరోగా ‘సకల కళా వల్లభుడు’ టీజర్ విడుదల

దీపాల ఆర్ట్స్ సమర్పణలో సింహ ఫిలిమ్స్ పతాకంపై తనిష్క్ రెడ్డి హీరోగా, శివగణేష్ దర్శకత్వంలో అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం పృథ్వీ (30ఇయర్స్ ఇండస్ట్రీ) చే విడుదల చేయించారు.
ఈ సందర్భంగా నిర్మాత అనిల్ మాట్లాడుతూ.. ‘‘హీరో తనిష్క్ మా సినిమాకు పెద్ద ఎస్సెట్. ఫైట్స్ డాన్సులు బాగా చేసాడు. మిగతా టీమ్ కూడా చాలా కష్టపడి పని చేశారు. ప్రస్తుతం మా సకల కళా వల్లభుడు సినిమా సెన్సార్ క్లీయరెన్సు కోసం ఎదురుచూస్తోంది. రాగానే విడుదల ఉంటుంది అని తెలిపారు.
మరో నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ ల ఔట్ ఫుట్ చాలా బాగా ఇచ్చారు. డైరెక్టర్ శివ గణేష్ మాకు మంచి మిత్రుడు. మమ్మల్ని భరించి సినిమాను పూర్తి చేశారు. ఆర్టిస్టులు అందరూ మంచి సపోర్ట్ ను అందించారు. ఈ సినిమా విడుదల అనంతరం బుర్రకథ చిత్రంతో రానున్నాము. ఇలానే ఏడాదికి 2 సినిమాలు మా బ్యానర్ నుంచి వస్తాయని తెలియ చేస్తున్నాము. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనేదే మా ఆకాంక్ష..’’ అని అన్నారు.
డైరెక్టర్ శివగణేష్ మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ కామెడీ జోనర్. నిర్మాతలు నా ఫ్రెండ్స్ కనుక చాలా సపోర్టివ్ గా నిలిచారు. వారిసహకారంతోనే సినిమా పూర్తి చేయగలిగాను. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే… పృథ్వీ గారి కామెడీ హైలెట్ అవుతుంది. హీరో తనిష్క్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అక్టోబర్- నవంబర్ మధ్యలో సినిమా రిలీజ్ ఉంటుంది’’ అని చెప్పారు.
హీరో తనిష్క్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ మూవీ. ఈ సినిమాలో చిరు గారి పోస్టర్స్, మెగా పవర్ స్టార్ గారి హెయిర్ స్టయిల్, బన్నీ గారి సాంగ్ ఉంటుంది. మెగా అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది మా ప్రయత్నం. మంచి సినిమాలో నేను ఒక పార్ట్ అయ్యినందుకు హ్యాపీ గా ఉంది’’ అన్నారు.
కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘యూత్‌కు కనెక్ట్ అయ్యే చిత్రం ఈ సకల కళా వల్లభుడు. తనిష్క్ మంచి నటుడే కాదు చాలా కళలు ఉన్నాయతనికి. అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అతని లుక్ చూస్తే స్టేట్‌రౌడీలో చిరు గారి లుక్ కనిపిస్తుంది. ఇక నేను ఈ సినిమాలో బాబా పాత్రను పోషించాను. ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది నా పాత్ర. అందరికీ నచ్చే చిత్రం అవుతుంది..’’ అని అన్నారు.
తనిష్క్ రెడ్డి, మేఘల గుప్తా, జీవ, పృథ్వీ, సుమన్, చిన్నా, శృతి, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సాయి చరణ్, ఎడిటర్: ధర్మేంద్ర, మ్యూజిక్: అజయ్ పట్నాయక్, నిర్మాతలు: అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్; డైరెక్టర్: శివగణేష్.