తనిష్క్ రెడ్డి ‘సకల కళా వల్లభుడు’ రెగ్యులర్ షూటింగ్

యువన్ టూరింగ్ టాకీస్ మరియు సింహా ఫిలిమ్స్ సంయుక్తంగా శివ గణేష్ దర్శకత్వంలో తనిష్క్ రెడ్డి హీరోగా.. అనిల్ కుమార్ గుంట్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దర్పణం తర్వాత తనిష్క్ రెడ్డి హీరోగా చేస్తున్న చిత్రమిది. నటునిగా తనిష్క్ రెడ్డి ని ఓ మెట్టు ఎక్కించే చిత్రమిది. మంచి కథ కుదిరింది. దర్శకుడు శివ గణేష్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. విలేజ్ నేపధ్యంలో నడిచే యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఓ ప్రముఖ హీరోయిన్ నటించనుంది. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. జనవరి 3 నుంచి పార్వతీపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరపబోతున్నాం. ఆస్ట్రేలియా లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేశాం. తప్పకుండా అందరికి నచ్చే, మెచ్చే చిత్రం అవుతుంది మా ‘సకల కళా వల్లభుడు’ చిత్రం.. అని అన్నారు.
తనిష్క్ రెడ్డి తో ప్రముఖ హీరోయిన్ నటించనున్న ఈ చిత్రంలో.. సుమన్, వినోద్ కుమార్, చిన్నా, పృథ్వి, జీవా, ఉత్తేజ్, అనంత్, అపూర్వ తదితరులు నటించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: సాయి చరణ్, పాటలు: రామ్ పైడిశెట్టి, గిరిధర్, కో ప్రొడ్యూసర్స్: శ్రీకాంత్, త్రినాథ్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: చిన్నా, నాగేంద్రమ్మ, నిర్మాత: అనిల్ కుమార్ గుంట్రెడ్డి, దర్శకత్వం: శివ గణేష్.