చిన్న సినిమాలకు ప్రత్యేకంగా ఐదో షో ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్’ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్బంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా హైద్రాబాద్ సారథి స్టూడియో లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….
ఆర్ కె గౌడ్ మాట్లాడుతూ .. తెలంగాణ ప్రభుత్వం తరపున కమిటీలో ఉన్న మంత్రులు శ్రీ కె.టి.ఆర్, శ్రీ తుమ్మల నాగేశ్వర రావు , శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గార్లకు ఈ కమిటీ ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. అలాగే సింగల్ విండో పద్దతిలో సినిమా షూటింగ్ లకు పర్మిషన్స్ ఎఫ్.డి.సి ద్వారా ఇవ్వడం మంచి పరిణామమని అయన అన్నారు. అలాగే చిన్న సినిమాకు తప్పకుండా థియేటర్ లో నాలుగు షోలు నడుస్తున్నాయి. ఇప్పుడు మరో షో పెంచడం ద్వారా చిన్న సినిమాలకు అవకాశం కలుగుతుంది. దానికోసం జి.ఒ కూడా ఇవ్వాలి. దాంతో పాటు థియేటర్స్ ల ఆన్ లైన్ విధానం వల్ల ఏ థియేటర్లో కూడా బ్లాక్ జరగకుండా అలాగే ఫ్రాడ్ జరగకుండా… ప్రొడ్యుసర్స్ కి కరక్ట్ గా అకౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది దీని వల్ల ప్రతి నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్స్ కు లాభం జరిగే అవకాశం ఉంటుంది…
సింగల్ విండో పర్మిషన్ వల్ల ఎఫ్.డి.సి. ద్వారా పోలిస్ పర్మిషన్ కాని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కాని మున్సిపల్ డిపార్ట్ మెంట్ కాని హెచ్.ఎమ్.డి.ఎ. కాని మరే ఇతర ప్రభుత్వ టూరిసమ్ కాని ఇవన్ని సింగల్ విండో పరిధిలోకి వస్తాయి నిర్మాత ఎక్కడ షూటింగ్ చేయలనుకున్న ఎఫ్.డి.సి. లో వారం రోజుల ముందు చాలన్ కడితే ఆ నిర్మాత వారం తరువాత ఎక్కడైన షూటింగ్ జరుపుకోవచ్చు పర్మిషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు… చిన్న సినిమాకు ఒక్క షో పర్మిషన్ విధానం వల్ల దాదాపు ఇప్పటికి మూడు వందల (300) చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఉన్నాయి వీటన్నింటికి రిలీజ్ అయ్యే అవకాశం లభిస్తుంది అలాగే ఎక్కువగా చిన్న సినిమాలను నిర్మించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సమస్యలు గత దశాబ్ద కాలంగా ఈ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి వీటన్నింటికి పరిష్కారం చూపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కమిటీ లో ఉన్న మంత్రులకు కె.టి.ఆర్ , తుమ్మల నాగేశ్వర రావు , తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహన్ గార్లకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ద్వారా మా కృతజ్ఞతలు తెలియజేస్తునాము అన్నారు.
నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ .. ప్రస్తుతం థియేటర్స్ రెంటల్ విషయం కూడా భారీ రేటును వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం 2500 మాత్రమే వసూలు చేస్తున్నారు .. కానీ దానికి బిన్నంగా ఇక్కడ పదివేల వరకు వసూలు చేస్తూ చిన్న నిర్మాతలకు చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. కొందరు పెద్ద నిర్మాతల చేతుల్లో ఉన్న థియేటర్స్ రెంటల్ విధానం కూడా తగ్గించాలని లేదంటే ఈ విషయం పై ధర్నా కూడా చేసేందుకు సిద్ధమని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకునేలా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కూడా కలవనున్నామని తెలిపారు.