ట్యాక్స్ త‌గ్గించే వ‌ర‌కు నిరాహార దీక్ష‌ తో పోరాటం చేస్తాం !

 కేంద్ర‌ ప్ర‌భుత్వం సినిమా ఇండ‌స్ట్రీ పైన‌ 28% జి.ఎస్.టి. ట్యాక్స్ విదించ‌డం వల్ల  ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఎంతో న‌ష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా చిన్న‌ నిర్మాత‌ల‌కు సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబ‌ట్టి  జి.ఎస్.టి. ని 10% గా స‌వ‌రించాల‌ని మేము కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. చేయ‌ని ప‌క్షంలో సోమ‌వారం నుండి నిర‌స‌న‌ తెలుపుతూ ఫిల్మ్ చాంబ‌ర్ వ‌ద్ద‌ నిర‌హ‌ర‌ దీక్ష‌ చేస్తూ ట్యాక్స్ త‌గ్గించే వ‌ర‌కు పోరాటం చేస్తాం…అని  “తెలంగాణ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్” అధ్యక్షకార్యదర్శులు  ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ , సాయివెంక‌ట్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు .

ఇటీవల సినిమా టికెట్ రేట్ల‌ ను పెంచుతూ విడుద‌ల చేసిన‌ జి.వో ను… న‌లుగురు,ఐదుగురు ధియేటర్ లీజ్ దారులు హోమ్ సెక్ర‌ట‌రిని మేనేజ్ చేసి టికెట్స్ రేట్లు  పెంచుకునే విదంగా  జి.వో తీసుకు వచ్చారు . ఈ జీ.వో  చీఫ్ సెక్ర‌ట‌రికి కూడా తెల‌ప‌కుండా ఇవ్వ‌డం జ‌రిగింది. దీనికి “తెలంగాణ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్”తరఫున నిర‌స‌న‌ తెలిపాము. దానికి  ముఖ్య‌మంత్రి గారు స్పందించి 23/06/2017 న‌ వ‌చ్చిన‌ జి.వో ను నిలుపుద‌ల‌ చేస్తూ ఉత్త‌ర్వుల‌ను ఇవ్వడం జ‌రిగింది. దీనికి మేము ముఖ్య‌మంత్రి గారికి శిర‌స్సు వంచి పాదాబివంద‌నం చేస్తున్నాము.  ఎందుకంటే.. ఆయ‌న‌ పేద‌ ప్ర‌జ‌లు ,సామాన్య‌ ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉండే విదంగా చాలా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. కాబ‌ట్టి, అందులోభాగం గా  సినిమా టికెట్ రేట్ల‌ను త‌గ్గించ‌డం హ‌ర్ష‌నీయం. గ‌తంలోనే ఈ ప్ర‌భుత్వం సామాన్య‌ ప్రేక్ష‌కులు చూసే 10 రూపాయ‌ల‌ టికెట్ ను పెంచ‌కూడ‌ద‌ని జి.వో ద్వారా తెల‌ప‌డం జ‌రిగింది.అలాగే,   థియేటర్  మెయింట్ నెన్స్ కోసం టికెట్ కి  7 రూపాయలు తీసుకునేందుకు అనుకూలంగా తెచ్చుకున్న‌ జి.వో. కూడా ర‌ద్దు చేసారు…

రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి కూడా మా విన్న‌పం ఫిల్మ్ ఇండ‌స్ట్రీ పైన‌ కేర‌ళ‌లో సినిమాల‌పైన‌ ఉండే ట్యాక్స్ ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం పూర్తిగా విర‌మించుకుంది .అలాగే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం పూర్తిగా విర‌మించుకుంది. అలాగే బెంగాల్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం 28% ఉండే జి.ఎస్.టి. లో 12% రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌గ్గించింది. కాబ‌ట్టి అలాగే మ‌న‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నుండి కూడా చిన్న‌ సినిమాకి పూర్తిగా 7% ట్యాక్స్ ని పూర్తిగా తీసేయాల్సిందిగా కోరుతున్నాము

 ముఖ్య‌మంత్రి గారికి మా విన్న‌పం ఏమిటంటే … డిజిట‌ల్ టెలికాస్ట్ దోపిడిదారులు ప్ర‌క్క‌ రాస్ట్రాల్లో 2500 రూపాయ‌లు వారానికి ఉంటే మ‌న‌ రాష్ట్రంలో 10800 ల రూపాయ‌లు సినిమా థియేట‌ర్ల‌కు, 13 వేల‌ ‌రూపాయ‌లు  మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌కు వారానికి తీసుకుంటూ మొత్తం సినిమా ఇండస్ట్రీని దోచుకుంటున్నారు.  కాబ‌ట్టి మీరు చొర‌వ‌ తీసుకొని ప్ర‌క్క‌ రాష్ట్రాల‌ల్లో ఉన్న‌ విధంగా మ‌న‌ రాష్ట్రంలో కూడా 2500 రూపాయ‌లు చొప్పున‌ వారానికి డిజిట‌ల్ చార్జెస్ తీసుకునే విధంగా చేసి సినిప‌రిశ్ర‌మ‌ని  కాపాడాల‌ని కోరుతున్నాము . అలాగే థియేటర్స్  లీజ్ విధానం కూడా ర‌ద్దు అయ్యేలా, మీడియేట‌ర్స్ లేకుండా సినిమాలు రిలీజ్ అయ్యే  విధంగా చేస్తే మొత్తం సినిప‌రిశ్ర‌మ‌ బాగుంటుంది అని మీకు మనవి చేస్తున్నాము…