తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లకు అనుమతి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సినీరంగ ప్రముఖులు కలిసారు. చిరంజీవి ఆ విశేషాలు వివరించారు…
ఏడాది కాలంగా కలవాలని అనుకున్నాం కుదరలేదు
ఈ రోజు కలిసాం…ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు
కరోనా కారణంగా షూటింగ్ లేక ఇబ్బంది పడ్డాము.
ఇక్కడా జగన్ గారు కూడా అనుమతి ఇచ్చాం.
థియేటర్ లు మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని కోరాం.
నంది వేడుకలు పెండింగ్ ఉన్నాయి…ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం.2019-20 కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం
టికెట్స్ ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం…పరిశీలిస్తాం అన్నారు.అది జరిగితే పారదర్శకత ఉంటుంది…మాకు చాలా మేలు జరుగుతుంది
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మాకు ఆనందం కలిగించింది.
వైజాగ్ లో స్టూడియో కి వైఎస్సార్ భూమి ఇచ్చారు…దానిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం.
తెలంగాణలో షూటింగ్ లకు మార్గదర్శకాలు!
తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అలాగే మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం.
 
సగం పూర్తయిన సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్ లకు మాత్రమే అనుమతి
ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరి.
షూటింగ్ లో మాస్క్, భౌతికదూరం మస్ట్.
షూటింగ్ ఏరియాలో పాన్, సిగరెట్లు నిషేధం.
షూటింగ్ ఏరియాలో తప్పనిసరిగా డాక్టర్ ఉండాల్సిందే
ప్రతి రోజూ ఉదయాన్నే భౌతికదూరం గురించి చిత్ర యూనిట్ కు వివరించాలి
ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత నిర్మాతలదే.
షూటింగ్ లో 40మందికి మాత్రమే అనుమతి.
షూటింగ్ ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలి.
కార్లను శానిటైజ్ చేసిన తర్వాతే ఆర్టిస్టుల దగ్గరికి పంపాలి
ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ ప్రాంతాల్లో తప్పనిసరిగా శానిటైజర్, హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచాలి
కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్ లు చేయకూడదు
వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ లు జరపకూడదు
మేకప్ వేసుకున్నా ఆర్టిస్టులు ఫేస్ షీల్డ్ ను ఉపయోగించాలి
ఇండోర్ షూటింగ్ లకే ప్రాధాన్యత ఇవ్వాలి
మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రస్సర్లు పీపీఈ కిట్లు ధరించాలి