వినాయక్ చేతులమీదుగా ‘తీరం’ ట్రైలర్ విడుదల !

అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో యల్ యస్ ప్రొడక్షన్స్ సమర్పణలో అఖి క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్ పై  యం. శ్రీనివాసులు నిర్మించిన  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “తీరం”. శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్స్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ని సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు, మరో హీరో శ్రావణ్ వైజిటి, కెమెరామెన్ శ్రావణ్ జి.కుమార్, నటుడు అజాస్, సినేటెరియా గ్రూప్ సిఇఓ వెంకట్ బొలేమోని, నిర్మాత యం. శ్రీనివాసులు పాల్గొన్నారు..
అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ..  “సినిమా యూత్ కి తగ్గట్లుగా ట్రెండీగా  తీయటం జరిగింది. సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఉంటూనే అంతర్లీనంగా ఒక చక్కని సందేశం ఈ చిత్రంలో చూపించటం జరిగింది. కచ్చితంగా ప్రేక్షకులకు తీరం సినిమా నచ్చుతుంది” అన్నారు.
శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ.. “తీరం చిత్రాన్ని అనిల్ సుపెర్బ్ గా చిత్రీకరించారు.. సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి.. శ్రవణ్ కెమెరా విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి”అన్నారు.
‘సినేటెరియా’ గ్రూప్ సిఇఓ వెంకట్ బోలేమోని మాట్లాడుతూ.. ” తీరం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఒక అద్భుతమైన ప్రేమకథా చిత్రం. కొత్త కంటెంట్ తో అనిల్ ఇనమడుగు ఈ సినిమాని రూపొందించాడు. ఈ నెల 29న తీరం సినిమాని విడుదల చేస్తున్నాం” అన్నారు..
ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రశాంత్ బిజె, కెమెరా; శ్రావణ్ జి.కుమార్,ఎడిటింగ్; శ్రావణ్ జి.కుమార్.