అవును …అక్టోబ‌ర్ నాకు చాలా క్రేజీ !

గ్లామర్ హీరోయిన్ స‌మంత‌కి అక్టోబ‌ర్ నెల చాలా క్రేజీ అని చెప్ప‌వ‌చ్చు. ఈ అమ్మ‌డు అక్టోబ‌ర్ 6న చైతూని వివాహం చేసుకోనుండ‌గా, ఇదే నెల‌లో సామ్ న‌టించిన రెండు క్రేజీ ప్రాజెక్టులు విడుద‌ల కానున్నాయి. విజ‌య్ -సమంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘మెర్స‌ల్’ చిత్రం తెర‌కెక్క‌గా ఈ మూవీ అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. ఈ మూవీపై తెలుగు, త‌మిళంలో చాలా హోప్స్ ఉన్నాయి. ఇక నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ‘రాజుగారి గ‌ది 2’ చిత్రంలోను స‌మంత న‌టించింది. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుద‌ల కానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబ‌ర్ 18న దీపావ‌ళి కానుండ‌గా, పెళ్లి త‌ర్వాత స‌మంత‌-చైతూల‌కి ఇదే తొలి పండుగ. ఇలా స‌మంత‌కి అక్టోబ‌ర్ చాలా క్రేజీ అని చెప్ప‌వ‌చ్చు. ఈ విష‌యాల‌ను ర‌మేష్ బాల అనే సోష‌ల్ మీడియా స్ట్రాట‌జిస్ట్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తే… “అవును .. అక్టోబ‌ర్ నాకు చాలా క్రేజీ “అంటూ రీ ట్వీట్ చేసింది స‌మంత.