టైగ‌ర్ తో `లోఫ‌ర్‌` భామ‌ రహస్య వివాహం?

పూరీ జ‌గ‌న్నాథ్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `లోఫ‌ర్‌` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది దిశా ప‌టాని. `లోఫ‌ర్‌` సినిమా దిశాకు క్రేజ్ తీసుకురాలేక‌పోయిన‌ప్ప‌టికీ బాలీవుడ్‌లో మాత్రం ఆమె పేరు సంపాదించుకోగ‌లిగింది. `బేఫిక్రా` అనే ఆల్బ‌మ్‌లో టైగ‌ర్ ష్రాఫ్‌తో క‌లిసి న‌టించిన‌ప్ప‌టి నుంచి వారి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది.
అప్ప‌ట్నుంచే వీరిద్ద‌రూ క‌ల‌సి తిర‌గ‌డం, పార్టీల‌కు హాజ‌ర‌వ‌డం  చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రి ప్రేమకు టైగ‌ర్ తండ్రి జాకీ ష్రాఫ్ అడ్డుచెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ, త‌ల్లి ఆయేషా మాత్రం అడ్డుగా నిలిచారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల వీరిద్ద‌రూ ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. న్యూఇయ‌ర్ వేడుక‌ల కోసం శ్రీలంక వెళ్లిన వీరిద్ద‌రూ అక్క‌డే పెళ్లి చేసుకున్నార‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్ద‌రూ దండ‌లు మార్చుకుంటున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.