‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాలో ప్రభాస్, మహేష్, రానా

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ 2017 సంవత్సరానికి గాను తాజాగా ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్ టెన్‌లో టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోలకు చోటు దక్కడం విశేషం. ‘బాహుబలి’ మూవీతో వరల్డ్ వైడ్‌గా స్టార్‌డం సంపాదించుకున్న ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ జాబితాతో రెండో స్థానంలో నిలిచాడు. అలాగే సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆరో స్థానం, దగ్గుబాటి రానా ఏడో స్థానం దక్కించుకున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ తొలి స్థానం కైవసం చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , నాల్గో స్థానంలో హృతిక్ రోషన్, ఐదో స్థానంలో సిద్ధార్థ్ మల్హోత్రాలు నిలిచారు. మలయాళ కధా నాయకుడు దుల్కర్ సల్మాన్, అర్జున్ రాంపాల్ తో కలిసి తొమ్మిదో స్థానం దక్కించుకోవడం విశేషం. హైదరాబాద్‌ యువ మోడల్‌ బషీర్‌ అలీ 17వ స్థానం దక్కించుకున్నాడు. క్రేజ్‌తో పాటు పాపులారిటీ ఆధారంగా ప్రతి ఏడాది 50 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను ప్రముఖ దినపత్రిక టైమ్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.’బాహుబలి’ సిరీస్‌ మూలంగా ప్రభాస్‌ పేరు దేశం మొత్తం పాకిపోగా.. ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్‌ సాహో చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్‌ దర్శకుడు. వచ్చే ఏడాది సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ లవ్‌స్టోరీ తొలకరిలో స్టార్ట్‌ కానుంది !

ప్రేమించడానికి దాదాపు 40 ఏళ్లు వెనక్కి వెళ్లి మరీ ప్రభాస్‌ ప్రిపేర్‌ అవుతున్నారట. అది కూడా ఇండియాలో కాదు. యూరప్‌లో.1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అంటే.. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రేమలు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో చూడబోతున్నామన్నమాట. ఈ లవ్‌స్టోరీ తొలకరిలో స్టార్ట్‌ కానుందట. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా జూన్‌లో లాంఛనంగా ప్రారంభం అవుతుందట. జూలై ఫస్ట్‌ వీక్‌లో ప్రభాస్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని టాక్‌. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు డైరెక్టర్‌ రాధాకృష్ణ.

‘‘దర్శక–నిర్మాతలు హీరోయిన్‌ రోల్‌ కోసం నన్ను అప్రోచ్‌ అయినప్పుడు ప్రభాస్‌ హీరో అని నాకు తెలుసు. చాలా ఎగ్జైట్ అయ్యాను. గుడ్‌ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ మూవీ ఇది. సినిమాలో నా క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది’’ అని పూజాహెగ్డే పేర్కొన్నారు. ‘సాహో’ షూటింగ్‌ కోసం ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు ప్రభాస్‌. సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.