తాప్సీని బాయ్ కాట్ చేయాలంటున్నారు !

త‌న‌ని ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు  రాఘ‌వేంద్ర‌రావుపై ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్ గా మారింది తాప్సీ.ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది తాప్సీ. ఈ చిత్రంలో తాప్సీ న‌ట‌న‌కి మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక ఈ సినిమా త‌ర్వాత తెలుగులో చాలా ఆఫ‌ర్సే వ‌చ్చిన‌ప్పటికి ఆ సినిమాలు తాప్సీ కెరియ‌ర్ కి అంతగా హెల్ప్ కాలేదు. అయితే తమిళ్ లో ‘గంగ’ సక్సెస్ తర్వాత.. హిందీలో ఛాన్స్ లు రావడం.. అక్కడ ‘పింక్’ చిత్రం తో అమితాబ్ తో కలిసి హిట్ కొట్టేయడంతో.. తాప్సీకి ఇక పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ అమ్మ‌డు తెలుగులో ‘ఆనందో బ్ర‌హ్మ’ అనే సినిమా చేస్తోంది.

“శరీరంలోని నడుము వెనక భాగంపై కొబ్బరికాయతో కొట్టడం వల్ల కలిగే శృంగారపరమైన ఉద్వేగాలు ఏముంటాయే ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయాను” అంటూ తాప్సీ మాట్లాడిన మాట‌లను తప్పుబడుతున్నారు. వ‌రుస హిట్స్ రావ‌డంతో తాప్సీ పొగ‌రు త‌ల‌కెక్కిందంటూ కొంద‌రు ద‌ర్శ‌కులు ఆమెపై నిప్పుల వ‌ర్షం కురిపిస్తున్నారు. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడిపై తాప్సీ చేసిన కామెంట్స్ ని వెన‌క్కి తీసుకోవ‌డంతో పాటు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ద‌ర్శ‌క సంఘం డిమాండ్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాఘ‌వేంద్ర‌రావు దీనిపై స్పందించ‌క‌పోయిన‌ప్ప‌టికి ప‌రిశ్ర‌మ‌లోని చాలా మంది పెద్ద‌లు మాత్రం తాప్సీ మాట‌ల‌ని ఖండిస్తున్నారు.అంత పెద్ద ద‌ర్శ‌కుడిపై తాప్సీ చేసిన కామెంట్స్ తో తెలుగులో ఇక ఆమెకు ఆఫర్స్ రావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు.

ప్ర‌స్తుతం ఈమె చేసిన ‘ఆనందో బ్ర‌హ్మ’ త్వ‌ర‌లో విడుద‌ల కానుండ‌గా ఆ సినిమాను బాయ్ కాట్ చేయాల‌ని సోష‌ల్ మీడియాలో కాంపెయిన్ మొద‌లు పెట్టారు. మీడియా వ‌ర్గాలు కూడా ఈమె సినిమాని ప్ర‌మోట్ చేసేందుకు ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తుంది. దీంతో ‘ఆనందో బ్ర‌హ్మ’ చిత్ర నిర్మాత‌లు త‌లలు ప‌ట్టుకొని కూర్చున్నారు. ఏదేమైనా తాప్సీ కామెంట్స్ ఇటు సోష‌ల్ మీడియాలోను.. అటు బ‌య‌ట కూడా చాలా హాట్ హాట్ గా మారాయి. తెలుగు పరిశ్రమపై అమర్యాదపూర్వకంగా మాట్లాడటం తగదని పలువురు తాప్సీకి హితవు పలికారు. మ‌రి బాగా రాజుకున్న ఈ వివాదంపై తాప్సీ ఏ వివ‌ర‌ణ ఇచ్చినా కూడా ఉప‌యోగం ఉండ‌క‌పోవ‌చ్చు.