కరణ్ తో ప్రభాస్ భారీ డీల్

ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయి హీరో  గా ఎదిగాడు. ‘బాహుబలి’ సినిమా తొలి భాగం రిలీజ్ అయిన తరువాత పలు బాలీవుడ్ సినిమాల్లో ప్రభాస్ కు ఆఫర్లు వచ్చాయి. అయితే బాహుబలి పూర్తయితే గాని, ఇతర సినిమాలు అంగీకరించకూడదని నిర్ణయం తీసుకున్న ప్రభాస్, అన్నింటిని రిజెక్ట్ చేశాడు. రెండో భాగం రిలీజ్ తరువాత ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో బాహుబలి 2 సృష్టిస్తున్న సంచలనాలతో అక్కడి నిర్మాతలు కూడా ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే ‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ సమర్పకుడిగా వ్యవహరించిన కరణ్ జోహర్, ప్రభాస్ తో స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకునేలా ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నాడట. గతంలో బాహుబలి 2 సక్సెస్ పార్టీ ఇచ్చాడు కరణ్. కానీ ఆ సమయంలో ప్రభాస్ విదేశాల్లో ఉండటంతో ఆ పార్టీలో పాల్గొనలేదు. అందుకే ఇటీవల ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ పార్టీ ఇచ్చాడు కరణ్. ఈ పార్టీలోనే ప్రభాస్ తో వరుసగా సినిమాలు చేసేందుకు చర్చించాడట. ప్రభాస్ కూడా కరణ్ తో డీల్ కు సుముఖంగానే ఉన్నాడట.