వసూళ్ళలో టాప్-10 భారతీయ సినిమాలివే !

ఒకప్పుడు ఎన్ని రోజులు థియేటర్లలో సినిమా నిలిచిందన్నదాన్ని బట్టి హిట్ స్థాయిని అంచనా వేసేవారు. ప్రస్తుతం సినిమా తీరు మారింది. వాటి లెక్కలూ మారాయి. ఎన్ని కలెక్షన్లు వచ్చాయి..? ఎన్ని రికార్డులను తిరగరాసింది..? అన్నదాన్ని బట్టి హిట్టా ఫట్టా..? అన్నది తేల్చేస్తున్నారు. కథలో దమ్ము ఉంటే కలెక్షన్లు వాటంతట అవే వస్తాయని సినీ వర్గాలు చెబుతుంటాయి. అలాగే హీరోల స్టార్‌డమ్‌ను బట్టి కూడా ఫ్లాప్ సినిమా అయినా రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయని పలుమార్లు రుజువయ్యాయి.అయితే చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసిన సంఘటనలున్నాయి. అలా భారత సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.  తాజాగా భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సత్తా తెలుగు ఇండస్ట్రీకి కూడా ఉందని బాహుబలి-2 నిరూపించింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 సినిమా ఇవే చూడండి …..

 1. దంగల్- 1862 కోట్ల రూపాయలు (చైనాలో ఇంకా ప్రదర్శితమవుతోంది)
2. బాహుబలి-2- 1623 కోట్ల రూపాయలు (ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది)
3. పీకే- 792 కోట్ల రూపాయలు
4. బాహుబలి-1: 650 కోట్ల రూపాయలు
5. భజరంగీ భాయీజాన్: 626 కోట్ల రూపాయలు
6. ధూమ్-3: 585 కోట్ల రూపాయలు
7. సుల్తాన్: 584 కోట్ల రూపాయలు
8. కబాలి: 477 కోట్ల రూపాయలు
9. ప్రేమ్ రతన్ దన్ పాయో: 432 కోట్ల రూపాయలు
10. చెన్నై ఎక్స్‌ప్రెస్: 423 కోట్ల రూపాయలు