బుల్లితెరపైనా భారీ విజయాలు : టాప్‌-10

బుల్లితెరపైనా మంచి టిఆర్‌పి రేటింగ్స్‌తో  కొన్ని సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అత్యధిక టిఆర్‌పి రేటింగ్స్‌ సాధించిన టాప్‌-10 సినిమాలు ఇవే…
‘సరిలేరు నీకెవ్వరు’ : ఈ చిత్రానికి అత్యధిక టిఆర్‌పి రేటింగ్‌ వచ్చింది. టాలీవుడ్‌ చరిత్రలోనే ఇంతటి రేటింగ్‌ రావడం ఇదే తొలిసారి. 23.4 టిఆర్‌పి రేటింగ్‌తో ఈచిత్రం మొదటి స్థానంలో ఉంది. ఇందులో మహేష్‌బాబు, రష్మిక హీరో, హీరోయిన్లుగా నటించారు.
‘బాహుబలి’ ది కన్‌క్లూజన్‌ : బాహుబలి కొనసాగింపుగా ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాష్‌, అనుష్క, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ నటించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 22.70 టిఆర్‌పి రేటింగ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది.
‘శ్రీమంతుడు’ : యాక్షన్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘శ్రీమంతుడు’ లో మహేష్‌బాబు, శృతిహాసన్‌, జగపతిబాబు నటించారు. ‘శ్రీమంతుడు’ 22.54 టిఆర్‌పి రేటింగ్స్‌తో మూడోస్థానంలో ఉంది.
‘దువ్వాడ జగన్నాధమ్’‌ : డిజె. దువ్వాడ జగన్నాధమ్‌ మూవీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో అల్లు అర్జున్‌, పూజాహెగ్డె నటించారు. డిజె 21.7 టిఆర్‌పి రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో ఉంది.
‘బాహుబలి’ : ‌ ప్రభాష్‌తో ఎస్‌ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం బుల్లితెరపై 21.54 టిఆర్‌పి రేటింగ్స్‌తో ఐదోస్థానంలో ఉంది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ 22.70 టిఆర్‌పి రేటింగ్స్‌తో రెండో స్థానంలో ఉంది.
పై ఐదు సినిమాల తరువాత వరుసగా
‘ఫిదా’ (21.31)
‘గీత గోవిందం’ (20.80)
‘జనతా గ్యారేజ్’‌ (20.69)
‘మహానటి’ (20.21)
‘రంగస్థలం’ (19.5) టిఆర్‌పి స్థానాలతో ‘టాప్ 10’ లో ఉన్నాయి.