ముక్కోణపు ప్రేమకథ ఆనంద్‌ ‘ద్వారం’ ప్రారంభం !

నూతన దర్శకుడు ఆనంద్‌ స్వీయ దర్శకత్వంలో క్రాఫ్ట్‌మెన్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌, పద్మశ్రీ క్రియేషన్‌, రాగా మూవీస్‌ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ద్వారం’. ఫిలింనగర్‌ దైవసన్నిధానంలో ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ కెమేరా స్విచ్చాన్‌ చేయగా, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ క్లాప్‌ కొట్టారు. సీనియర్‌ దర్శకుడు సాగర్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం చిత్ర దర్శకుడు ఆనంద్‌ మాట్లాడుతూ.. ఇది ముక్కోణపు ప్రేమకథ. భావోద్వేగాలతో కొనసాగే కుటుంబ కథాచిత్రం. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తిచేసుకుని షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌, వైజాగ్‌, అరకు, కేరళలో కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరించి మూడు షెడ్యూల్లో చిత్ర నిర్మాణం పూర్తి చేస్తాం. సంతోష్‌ ప్రతాప్‌ తమిళంలో నాలుగు చిత్రాల్లో హీరోగా చేశాడు. తెలుగులో తొలిసారి. అనమ్‌ఖాన్‌ నాయికగా పరిచయం అవుతుందని తెలిపారు.