త్రిష తొమ్మిదో సినిమా కూడా ‘ఓకే’ చేసింది !

ఇప్పటికే త్రిష చేతిలో ‘మోహిని’, ‘గర్జన’, ‘పరమపదం’, ‘విళైయాడు’ వంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో పాటు ’96’, ‘చతురంగవేట్టై–2’, ‘1818’, తదితర 8 చిత్రాలున్నాయి. తాజాగా మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. లేడీ డిటెక్టివ్‌గా అవతారమెత్తనున్నారు నటి త్రిష. కథానాయకి డిటెక్టివ్‌గా నటించడం అన్నది కోలీవుడ్‌లో ఇదే ప్రథమం అన్నది గమనార్హం. నటి అనుష్క, నయనతారల తరువాత హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల అవకాశాలు నటి త్రిషనే వరిస్తున్నాయని చెప్పవచ్చు. దీనికి ‘కుట్రపయిర్చి’ అనే టైటిల్‌ నిర్ణయించారు.  ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వర్ణిక్‌ పరిచయం కానున్నారు. ఈయన దర్శకుడు బాలా వద్ద ‘తారైతప్పటై’ చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం.

‘కుట్రపయిర్చి’ 1980లో సాగే నేర పరిశోధన కథా చిత్రంగా ఉంటుందన్నారు దర్శకుడు వర్ణిక్‌ . ఒక హత్య, దాని గురించి ఇన్వెస్టిగేషన్‌ ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందన్నారు. ఇందులో త్రిష ప్రధాన పాత్రను పోషించనున్నారని తెలిపారు. ఆమె ఒక ప్రైవేట్‌ డిటెక్టివ్‌గా నటించనున్నారని చెప్పారు. హీరోయిన్‌ డిటెక్టివ్‌గా నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే అవుతుందని అన్నారు. తొలి భారతీయ లేడీ డిటెక్టివ్‌ రజనీ పండిట్‌ను స్ఫూర్తిగా తీసుకుని త్రిష పాత్ర ఉంటుందని చెప్పారు. అయితే కుట్రపయిర్చి నిజసంఘటనల ఆధారంగా తయారు చేసిన కథ అని తెలిపారు.  ఇందులో త్రిషతో పాటు నటి సురభి, సూపర్‌ సుబ్బరాయన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారని తెలిపారు. దీనికి రథన్‌ సంగీతం, బాబుకుమార్‌ ఛాయాగ్రహణం అందించనున్నారని చెప్పారు. చిత్రం త్వరలోనే ప్రారంభం అవుతుందని దర్శకుడు తెలిపారు.

ఆ ఎనర్జీతో జోరుగా షూటింగ్స్‌లో పాల్గొంటా !

త్రిష కు ట్రావెలింగ్‌ అంటే ఇష్టం.వీలున్నప్పుడల్లా విదేశాలు చెక్కేస్తారు.  ఇటీవల లండన్, స్కాట్‌ల్యాండ్‌ వంటి పలు దేశాలు చుట్టొచ్చారు….
#బేసిక్‌గా నాకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. హాలిడే ట్రిప్‌ అంటే ఎగ్జైట్ అవుతాను. నా ఫేవరెట్‌ హాలిడే స్పాట్‌ న్యూయార్క్‌. మా నాన్నగారు అక్కడే వర్క్‌ చేసేవారు. సో.. అక్కడికి చాలాసార్లు వెళ్లాను.
# షాపింగ్‌ మాల్స్‌ ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు. దుబాయ్, లండన్, న్యూయార్క్‌ వంటివి షాపింగ్‌కు బెస్ట్‌ ప్లేసెస్‌. ఇప్పటివరకూ నేను షాపింగ్‌ చేసినవాటిలో బెస్ట్‌ అంటే స్విస్‌ వాచ్‌. వెనీస్‌ వెళ్లినప్పుడు అది కొనుక్కున్నాను.
#అడ్వెంచర్‌ ట్రిప్స్, నార్మల్‌ ట్రావెలింగ్‌ను ఒకేలా ఇష్టపడతాను. ఎనర్జీ లెవల్స్‌ ఫుల్‌గా ఉన్నప్పుడు బంగీ జంప్స్, స్కై డైవింగ్స్‌ చేస్తాను. షూటింగ్‌ అప్పుడు బాగా అలిసిపోతే బీచ్‌ సైడ్స్‌ లేదా హిల్‌ స్టేషన్స్‌లో సేద తీరతాను.
# నేను ట్రావెలింగ్‌కు వెళ్లానంటే.. వచ్చేటప్పుడు నా వెనకాల సూట్‌కేసులు సూట్‌కేసులు ఉండాల్సిందే. మా అమ్మ ఎప్పుడూ లైట్‌గా ప్యాక్‌ చేసుకో అంటుంటారు. అలాగే చేసుకుంటాను. కానీ వచ్చేటప్పుడు సూట్‌కేస్‌ల సంఖ్య పెరిగిపోతుంది. ఆ రేంజ్‌లో షాపింగ్‌ చేస్తాను.
# ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు డైట్‌ అస్సలు పాటించను. ఒకవేళ అలా చేస్తే అది మహా పాపమే అవుతుంది. నాకు నచ్చినంత తినేస్తా. ఎలాగూ ట్రావెలింగ్‌లో ఎక్కువగా నడుస్తూనే ఉంటాం కాబట్టి వెయిట్‌ కూడా కంట్రోల్‌లోనే ఉంటుంది.
#ఈ హాలిడే ట్రిప్‌లో నెదర్‌ల్యాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ వెళ్లాను. అక్కడ పూల తోటలో ఫుల్లుగా ఎంజాయ్‌ చేశాను. రంగు రంగుల పూల మధ్య మనసు ఆహ్లాదకరంగా అనిపించింది. స్కాట్‌ల్యాండ్‌లో మంచు వాన కురిసింది. ఆ వానకు ఒళ్లు పులకరించింది. హాలిడే అప్పుడు ఎలాంటి బాధ్యత ఉండదు. హ్యాపీగా ఎంజాయ్‌ చేయడం. అందుకే అక్కణ్ణుంచి తిరిగొచ్చేటప్పుడు కొంచెం ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆ ఎనర్జీతో ఇక్కడ జోరుగా షూటింగ్స్‌లో పాల్గొంటాను.