ఆమె హిట్ కొట్టింది… నిర్మాతలకి షాక్ కొట్టింది !

త్రిష… కెరీర్ ఇక ముగిసినట్టే అనుకుంటున్న టైంలో త్రిషకు తమిళంలో ఈ మధ్య ఓ మంచి హిట్ పడింది .దసరా సందర్భంగా రిలీజైన ’96’ మూవీ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో మరోసారి త్రిష క్రేజ్ మెరుస్తోంది. తెలుగులో ఆమె యంగ్, సీనియర్ అన్న తేడా లేకుండా అందరితోనూ ఆడిపాడింది. అయితే, గత కొన్నేళ్లుగా కొత్త అందాలు టాలీవుడ్లోకి రావడంతో త్రిష స్వంత రాష్ట్రానికి పరిమితం అయిపోయింది. ఏజ్ కూడా థర్టీ ప్లస్ అవ్వటంతో ముందులా గ్లామర్ రోల్స్ రావటం లేదు. అందుకే, మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చి.. తమిళ చిత్రాలతోనే ఇంతకాలం నెట్టుకొచ్చింది. తెలుగులో బాలకృష్ణ ‘లయన్’ తరువాత కనిపించనే లేదు.ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతలకి రూల్స్ పెడుతోందట.
’96’ మూవీ సూపర్‌హిట్ అయినా.. ఈసారి త్రిష గ్లామర్‌తో ఆకట్టుకోలేదు. 96 చిత్రంలో తన ఏజ్‌కు తగ్గ పాత్రలోనే చాలా సింపుల్‌గా కనిపిస్తూ కట్టిపడేసింది. గంభీరమైన నటనతో సంచలనం అయింది. అదే ఇప్పుడు మరోసారి మన తెలుగు ప్రొడ్యూసర్ల దృష్టి ఆమె మీద పడేలా చేస్తోంది.
తెలుగులో హీరోయిన్ల కొరతలేకున్నా సీనియర్ హీరోల పక్కన నటించే అందగత్తెల సంఖ్య బాగా తగ్గిపోతోంది. చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలాంటి హీరోలకు హీరోయిన్స్ సెట్ అవటం లేదు. ఆ సీనియర్ హీరోయిన్స్‌కి కూడా ఎంతో కొంత క్రేజ్ ఉండాలి.ఇప్పుడు అదే నయనతార, త్రిష లాంటి వారికి వరంగా మారుతోంది. 96 హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన త్రిష తెలుగు సీనియర్ హీరోల పక్కన బాగా సరిపోతుంది.ఇప్పటికే ఆమె వారితో మంచి సినిమాలు చేసింది.
అదే ఆశతో ఆమె తలుపు తట్టిన ఓ ప్రొడ్యూసర్‌కి త్రిష పెద్ద షాకిచ్చిందట. టాలీవుడ్ సీనియర్ హీరోతో నటించటానికి 2 కోట్లు డిమాండ్ చేసిన ఆమె ..గ్లామర్ ఒలకబోత ఉండకూడదని రూల్ పెట్టిందట. ‘రెండు కోట్లు కావాలి. అందాల వడ్డింపు ఉండకూడ’దనే సరికి అతనికి మతిపోయిందట. చేసేది లేక త్రిష మీద నుంచి దృష్టి మరల్చి మరో హీరోయిన్ కోసం చూస్తున్నాడట.