అతనితో నటిస్తే చాలు, నా కెరీర్ పరిపూర్ణమైనట్లే !

త్రిష అగ్ర హీరోలతో జోడీ కట్టి ఎన్నో కమర్షియల్ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. పదహారేళ్లుగా చిత్రసీమలో రాణిస్తున్నది… ఒకప్పుడు దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినీ ప్రయాణంలో చిరస్మరణీయమైన విజయాల్ని అందుకున్న ఈ సుందరికి ఓ తీరని కోరిక ఉందట. దక్షిణాదిన దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలిసి నటించిన ఆమె ఇప్పటివరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఒక్క సినిమా చేయలేదు. ఈ విషయంలోనే తాను అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితుల వద్ద బాధపడిందట త్రిష. ‘రజనీకాంత్‌తో కలిసి ఒక్క సినిమాలో నటిస్తే చాలు తన కెరీర్ పరిపూర్ణమైనట్లే’నని ఆమె భావిస్తున్నదట. ఈ క్రమంలోనే రజనీకాంత్ చిత్రంలో అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందని తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..రజనీకాంత్ త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ (పిజ్జా ఫేమ్) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో నాయిక కోసం అన్వేషణ జరుగుతున్నది. ఈ చిత్రంలో ఎలాగైనా అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు త్రిష ప్రయత్నాలు తీవ్రం చేసిందని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రస్తుతం త్రిష తమిళంలో మెహిని గర్జనై సతురంగవేైట్టె-2 18 18తో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నది. నాయకి తర్వాత మరే తెలుగు చిత్రాన్ని అంగీకరించలేదు త్రిష.

దెయ్యాన్ని ఒక్కసారైనా చూడాలి ! 

దెయ్యాన్ని చూడటమేమిటి అని అనుకుంటున్నారా? త్రిష ఎప్పుడూ ప్రత్యేకమే అనిపిస్తుంది. ఈమె ప్రేమ పెళ్లి వరకూ వచ్చి రద్దైనా నటిగా కెరీర్‌కు ఎలాంటి భంగం కలగలేదు. ఆ తరువాత చాలా పాపులర్‌ అయ్యింది త్రిష. ఇప్పటికి తమిళం, తెలుగు చిత్రాలలో అగ్రనాయికల్లో ఒకరిగా రాణిస్తోంది.

” ప్రస్తుతం నా చేతిలో ఏడు చిత్రాలున్నాయి. వాటిలో మూడు చిత్రాలు దెయ్యం ఇతి వృత్తంతో కూడినవి. ‘మోహినీ’ చిత్రం పూర్తిగా దెయ్యం కథతో  తెరపైకి రానుంది. నాకు యాక్షన్‌ కథా చిత్రాలంటే, దెయ్యం కథా చిత్రాల్లో నటించడమే ఇష్టం అని చెప్పింది. భయానక దెయ్యం కథా చిత్రాలలో నటించి ప్రేక్షకులను భయపెట్టాలని కోరుకుంటున్నారు.దేవుడు ఉన్నది నిజం అయితే దెయ్యం కూడా ఉండవచ్చు. అయితే మనిషిని మించిన శక్తి ఉందని నేను నమ్ముతాను. దెయ్యాన్ని చూశామని చాలా మంది అంటుంటారు. నాకూ ఒకసారి దెయ్యాన్ని చూడాలని ఉంది. ఇతర హీరోయిన్లతో నటించడానికి  నెప్పుడూ రెడీనే. ఒకరికి మించిన హీరోయిన్లతో కలిసి నటించడం సరికొత్త అనుభవంగానూ, పోటీగానూ ఉంటుంది అని త్రిష చెప్పుకొచ్చింది.