స్టార్ హీరోలందరూ నా ఫేవరేట్‌లే !

చెన్నై బ్యూటీ త్రిష చిత్ర పరిశ్రమలో 50కి పైగా సినిమాలు చేసింది . తెలుగు, తమిళ్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. త్రిషకు ఎవరంటే ఇష్టమంటే? ఆసక్తికరమైన సమాదానం చెప్పింది…. “బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు తాను పెద్ద ఫ్యాన్” అని త్రిష పేర్కొంది. ఇక సౌత్‌లో మీరు పనిచేసిన హీరోల్లో ఎవరంటే ఇష్టం అని అడిగితే… టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అందరి పేర్లు పెద్ద లిస్ట్ చెప్పేసింది. అజిత్, సిద్ధార్థ్, పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్‌లు తన ఫేవరేట్‌లు అని అంటోంది.
పెళ్లి గురించి అడిగితే డిఫరెంట్‌గా సమాధానమిచ్చింది… ఇప్పుడు తన మనసులో పెళ్లి ఆలోచనే లేదని ..సినిమాలు తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టనని అంటోంది. కొంత కాలం క్రితం నిశ్చితార్థం పూర్తయి పెళ్లి ఆగిపోవడమే దీనికి కారణం…అందుకే ఇప్పట్లో తన పెళ్లికాదని త్రిష సూటిగా చెప్పింది.
సెన్సార్‌ బోర్డు ‘షాక్‌’ ఇచ్చింది
“త్రిష ముప్పై ఆరు ఏళ్లయినా కొంచెం కూడా క్రేజ్‌ తగ్గని బ్యూటీ. త్రిష చేతిలోప్రస్తుతం అరడజనుకుపైగా చిత్రాలు ఉన్నాయి. ఈ మధ్య విజయ్‌సేతుపతితో రొమాన్స్‌ చేసిన ’96’ , రజనీకాంత్‌ జంటగా నటించిన ‘పేట’ చిత్రాల విజయాలు త్రిషకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో ఆమె తమిళ చిత్రాలపైనే పూర్తిగా దృష్టి పెట్టింది . త్రిష నటిస్తున్న ‘పరమపదం విలయాట్టు’ హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రం. ఇందులో త్రిష తల్లిగా నటించింది. పగ, ప్రతీకారాలతో కూడిన ఈచిత్రం కోసం ఈ త్రిష ఫైట్స్‌ కూడా చేసింది. పగ, ప్రతీకారాలతో కూడిన ఈచిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘పరమపదం విలయాట్టు’ ఇటీవల సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఇది కుటుంబ కథా చిత్రం కాబట్టి… సెన్సార్‌ నుంచి ‘యు’ సర్టిఫికెట్‌ను ఆశించారు. అయితే సెన్సార్‌ బోర్డు ‘షాక్‌’ ఇచ్చింది. ‘యు/ఏ’ సర్టిఫికెట్‌ను ఇచ్చి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం కనుక.. ‘యు’ సర్టిఫికెట్‌ ఇవ్వలేమని సెన్సార్‌సభ్యులు చెప్పారట. ఈ చిత్రంలో త్రిష శత్రువులను క్రూరంగా చంపుతుందట. దీంతో ‘యు/ఏ’ సర్టిఫికెట్‌తోనే సరిపెట్టుకుని..త్వరలో ట్రైలర్‌ను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం త్రిష ‘రాంగీ’ అనే మరో హీరోయిన్‌ కథా చిత్రంలో చేస్తోంది.