ఆ పాత్రలు రెండూ మ్యాజిక్ క్రియేట్ చేశాయి!

త్రిష కెరీర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో ’96’ త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి బాట వేసింది. అందరినీ ఆకట్టుకునేలా,ఫీల్ గుడ్ కథతో,వాస్తవిక కోణంలో తెరకెక్కించాడు దర్శకుడు సి.ప్రేమ్ కుమార్.96 చిత్రానికి ముందు త్రిష మార్కెట్‌ చాలా డౌన్‌ అయిపోయ్యింది. తను నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు ఘోరంగా నిరాశ పరిచాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిత్రం ’96’. త్రిష విజయ్‌సేతుపతితో కలిసి నటించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇందులో జాను పాత్రలో నటించిన త్రిషపై విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రశంసలతో పాటు ఈ సినిమా త్రిషకు అత్యధిక అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ‘ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్’ నుంచి నిన్నటి ‘ఫిల్మ్ ఫేర్’ వరకు త్రిష మొత్తం 11 అవార్డులని ఈ సినిమాతో సొంతం చేసుకోవడం ఒక రికార్డు.
’96’ అంత విజయం సాధిస్తుందని త్రిషనే ఊహించలేదట.
’96` సినిమాపై నాకు మొదట్లో పెద్దగా నమ్మకాలు లేవు. పాత్ర చాలా సింపుల్‌గా బాగుంది అనుకున్నాను. అటువంటి పాత్రలో నటించిన చిత్రం ఇంత పేరు తెచ్చిపెడుతుందని ఊహించలేదు. సినిమా సక్సెస్‌ అవుతుందని.. అందులోని రామ్, జాను పాత్రల్లో ప్రేక్షకులు తమను చూసుకుంటారని భావించానని చెప్పింది. అయితే ఒక సాధారణ పసుపురంగు చుడీదార్‌ ధరించి నటించిన పాత్ర ఎంతగానో ఆదరింపబడిందని అంది. అంత నిరాడంబర రూపంలో ఆ చిత్రంలో కనిపించానని పేర్కొంది. నిరాడంబరత ఎప్పుడూ ఆదరింపబడుతుందని… అలా ఒకటి రెండు కథా పాత్రలు మ్యాజిక్‌గా నిలుస్తాయని అంది. నా కెరీర్‌లో `విన్నైతాండి వరువాయా` (తెలుగులో ‘ఏ మాయ చేశావే’) సినిమాలోని జెస్సీ పాత్ర, `96`లోని జాను పాత్ర మ్యాజిక్ క్రియేట్ చేశాయి. ఆ రెండింటినీ ఎప్పటికీ మర్చిపోలేన`ని త్రిష చెప్పింది.ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను సులభంగా ఆకట్టుకుంటాయని అంది.
 
మలయాళంలో చేసిన ‘హే జ్యూడ్’ చిత్రానికి మరో మూడు అవార్డులు వచ్చినట్టు తెలిపింది. అలా మొత్తం మీద ’96’, రజనీకాంత్‌తో జత కట్టిన ‘పేట’ చిత్రాల తరువాత త్రిష మళ్లీ పుల్‌ ఫామ్‌లోకి వచ్చేసింది. ’96’ ‘చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్- సమంత జంటగా నటిస్తుండగా,దిల్ రాజు నిర్మిస్తున్నారు.